భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.
అరవింద సమేత వీరరాఘవ
హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.
S/O సత్యమూర్తి
ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’ (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది.
అజ్ఞాతవాసి
ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు.
జులాయి
తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.
ఖలేజా
మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.
ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!