Mahindra XUV 3XO: రూ.7.49 లక్షలకే అదిరిపోయే కారును తీసుకొచ్చిన మహీంద్రా.. స్టన్నింగ్‌ ఫీచర్లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mahindra XUV 3XO: రూ.7.49 లక్షలకే అదిరిపోయే కారును తీసుకొచ్చిన మహీంద్రా.. స్టన్నింగ్‌ ఫీచర్లు ఇవే!

    Mahindra XUV 3XO: రూ.7.49 లక్షలకే అదిరిపోయే కారును తీసుకొచ్చిన మహీంద్రా.. స్టన్నింగ్‌ ఫీచర్లు ఇవే!

    April 30, 2024

    ప్రముఖ ఆటో మెుబైల్‌ కంపెనీ మహీంద్రా (Mahindra).. సరికొత్త కారును భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. తన ఎక్స్‌యూవీ 300 ఫేస్‌ లిఫ్ట్‌ కారులో మార్పులు చేసి ‘Mahindra XUV 3XO’ పేరుతో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రీవియస్‌ వెర్షన్‌తో పోలిస్తే ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్ పరంగా కీలక మార్పులు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారి పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను కూడా తీసుకొచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. ఈ ‘ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ’లోని వేరియంట్లు, వాటి ధరలు, ఫీచర్లపైనా క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    వేరియంట్లు

    ‘Mahindra XUV 3XO’ మోడల్‌ను రెండు వేరియంట్లలో లాంచ్‌ చేశారు. ఒకటి ‘MX​’ కాగా మరోటి ‘AX’. ఇందులో పెట్రోల్​ ఇంజిన్​తో పాటు డీజిల్​ ఇంజిన్​ కూడా అందుబాటులో ఉంది. వీటికి మేన్యువల్​, ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​కు ఇచ్చారు. డీజిల్​ వర్షెన్​లో మేన్యువల్​ గేర్​ బాక్స్​తో పాటు ఆటో షిఫ్ట్​+ గేర్​బాక్స్​ కూడా ఉంది.

    పవర్‌ఫుల్‌ ఇంజిన్‌

    Mahindra XUV 3XO.. మూడు రకాల ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌, 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌, టర్బో స్పోర్ట్‌ వేరియంట్‌లలో లభిస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఏఎంటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లను ఇది కలిగి ఉంది. 

    డిజైన్‌

    మహీంద్రా 3ఎక్స్ఓ.. ప్రీవియస్‌ వెర్షన్‌తో పోలిస్తే డిజైన్ పరంగా చాలా మార్పులతో వచ్చింది. కారు ముందువైపు రీడిజైన్ చేసిన బంపర్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల హౌసింగ్ ఉన్నాయి. వెనుకవైపు ఎల్ఈడీ లైట్ బార్, సీ ఆకారపు టెయిల్ ల్యాంప్‌లను అందించారు. అలాగే, నంబర్ ప్లేట్ ప్రీవియస్‌ వెర్షన్‌లో లాగా టెయిల్ లైట్‌పై ఉండదు. రియర్ బంపర్‌పై దాన్ని ఫిక్స్‌ చేసుకోవచ్చు. 

    ఇంటీరియల్‌ డిజైన్‌

    Mahindra XUV 3XO.. లోపలి డిజైన్స్‌ విషయానికి వస్తే.. పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా 10.25 అంగుళాల స్క్రీన్, బ్లూటూత్ కనెక్షన్‌, డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌ వంటి ఫీచర్లతో కూడిన లెవల్‌ 2 అడాస్‌తో ఈ నయా కారు వస్తోంది.

    భద్రతకు పెద్ద పీట

    Mahindra XUV 3XO ప్రామాణిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది. కారులోని ఆరు సీట్లకు ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు,  ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్‌లు, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లను కారుకు అందించారు. 

    కలర్ ఆప్షన్స్‌

    Mahindra XUV 3XO.. మొత్తం 7 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. కొన్ని వేరియంట్‌లు డ్యూయల్-టోన్ పెయింట్‌తో వస్తాయి. ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, డూన్ డస్ట్, సిట్రిన్ ఎల్లో కలర్‌ వేరియంట్లలో నయా కారును పొందవచ్చు. 

    ధర ఎంతంటే?

    Mahindra XUV 3XO.. ప్రారంభ వేరియంట్‌ ధరను కంపెనీ 7.49 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇందులో టాప్-ఎండ్ మోడల్‌ను రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. దేశంలోని అన్ని మహీంద్రా షోరూంలలో ఈ నయా కారు అందుబాటులో ఉండనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version