తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు మరో మలయాళ బ్లాక్ బాస్టర్ చిత్రం సిద్ధమవుతోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లేటెస్ట్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Release) తెలుగులోనూ విడుదల కాబోతోంది. గత నెల ఫిబ్రవరిలో కేరళలో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మలయాళ సినిమాలపై ఆసక్తి కనబరిచే టాలీవుడ్ ఆడియన్స్.. ఈ చిత్రం ఎప్పుడు తెలుగులో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది.
తెలుగులో వచ్చేది ఆ రోజే!
‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ‘మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది.
‘ప్రేమలు’ రికార్డ్‌ను బద్దలుకొట్టేనా?
మలయాళం సూపర్ హిట్ సినిమా ‘ప్రేమలు’ (Premalu).. మార్చి 8న తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తద్వారా తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును ‘మంజమ్మల్ బాయ్స్’ బీట్ చేస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో వస్తుడంటంతో తెలుగులోనూ మంచి పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి.
రూ.200 కోట్లకు పైగా గ్రాస్
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా దీనిని తెరకక్కించాడు. రిలీజ్ అనంతరం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. మలయాళంలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అటు తమిళంలోనూ ఇటీవల ఈ చిత్రం రిలీజ్ కాగా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా, ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు. అటు
ఈ సినిమా కథేంటి?
‘మంజుమ్మెల్ బాయ్స్’ కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం