యంగ్ బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’ రెడ్ టాప్ డ్రెస్‌లో సెగలు పుట్టించింది. తన మత్తెక్కించే అందాలతో కుర్రకారు హృదయాలను మరోమారు దోచేసింది.
సైమా అవార్డ్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీనాక్షి చౌదరి తళుక్కుమంది. తన క్రేజీ లుక్స్‌తో అక్కడి వారిని ఆకర్షించింది.
ఈ భామ తన కెరీర్‌ను తొలుత మోడల్‌గా ప్రారంభించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకుంది.
హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొట్టింది.
మోడలింగ్ నుంచి నటనపై దృష్టి పెట్టిన ఈ యంగ్ బ్యూటీ 2019లో హాట్‌స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకుముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో సైతం మీనాక్షి మెరిసింది.
‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా మీనాక్షి టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీ ఆహాలో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’ చిత్రంలో మీనాక్షి తళుక్కుమంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడికి నిరాశ తప్పలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్‌తో మీనాక్షికి లక్ కలిసి రాలేదు.
ఆడవి శేషు హీరోగా చేసిన ‘హిట్ 2’ సీక్వెల్‌లో ఈ అమ్మడు హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలోనూ ఈ భామకు చోటు దక్కింది.
అటు ప్రభాస్ అప్‌గమింగ్ మూవీ ‘రాయల్’లోనూ మీనాక్షి చౌదరికి ఛాన్స్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక విశ్వక్‌సేన్ తర్వాతి మూవీతో పాటు ‘మట్కా’ అనే చిత్రంలో కూడా ఈ యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా చేస్తున్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!