Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?

    Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?

    May 16, 2023

    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. ఫ్రాన్స్‌లో జరిగే 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననుంది. ఈ మేరకు నిర్వహకుల నుంచి ఆహ్వానం అందినట్లు మృణాల్‌ తెలిపింది.

    కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023లో తొలిసారి పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు మృణాల్‌ చెప్పింది. గ్లోబల్‌ ఫిల్మ్‌మేకర్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. 

    మృణాల్‌తో పాటు అనుష్క శర్మ, మానుషి చిల్లర్‌, సారా అలీఖాన్‌ కూడా కేన్స్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే అదితిరావు, ఐశ్వర్యరాయ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

    తెలుగులో వచ్చిన సీతారామం చిత్రంతో మృణాల్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా ఈ భామకు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనే స్థాయికీ మృణాల్‌ ఎదిగింది. 

    ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో NANI 30 ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 

    NANI 30 సినిమాతో పాటు హిందీలో పూజా మెరీ జాన్‌, పిప్పా, ఆంఖ్‌ మిచోలి సినిమాల్లో మృణాలు నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది. 

    ఓవైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతూనే సోషల్‌ మీడియాలోనూ మృణాల్ సూపర్‌ యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.

    మృణాలు ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా ‌అవుతున్నారు. ఆమె అందచందాలకు ముగ్దులవుతున్నారు.

    నెట్టింట మృణాల్‌ ఇస్తున్న హాట్‌ ట్రీట్‌ను తీసుకునేందుకు నెటిజన్లు ఆమెను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన బోల్డ్‌ ఫొటోలను లైక్, షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. 

    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోయిన్లలో మృణాల్‌ ఠాకూర్ ఒకరు. ఆమె ఖాతాను 8.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version