Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!

    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!

    April 10, 2023

    సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు?

    మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌ 

    భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు.

    మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది.

    ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా.

    మృణాల్‌: థ్యాంక్యూ

    ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి.

    మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం.

    ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌ 

    మృణాల్‌: ఇండియన్ సినిమా.

    ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి?

    మృణాల్‌: మళ్లీ మెుదలు

    ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా?

    మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా

    ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా.

    మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా.

    బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version