క్రిస్మస్ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పండగ జరుపుకుంటే మరికొందరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు విదేశాల్లో పండగను ఆస్వాదించారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
రామ్‌చరణ్ – ఉపాసన జంట.. కూతురు క్లింకారతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పనిచేసే వారితో కలిసి సంతోషంగా ఈ పండగ చేసుకున్నారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. క్రిస్మస్ రోజున ఎంతో సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ పక్కన కాఫీ దాగుతూ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది.
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తన భర్త సిద్ధార్ధ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. భర్తను ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌషల్ (Vicky Kaushal) – కత్రీనా కైఫ్ (Katrina Kaif) విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంది. శాంటా క్లాజ్ గెటప్‌లో ఉన్న వ్యక్తితో వారు దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడిపింది. క్రిస్మస్ ట్రీ, కేక్ మధ్య ఆమె దిగిన ఫొటో అలరిస్తోంది.
ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) ‘బేబీ జాన్’ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి క్రిస్మస్ జరుపుకుంది. చేతులు చాచి వారిద్దరు దిగిన ఫొటోపై మీరు ఓ లుక్కేయండి.
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara).. భర్త విఘ్నేష్, కవల పిల్లలతో క్రిస్మస్ రోజున సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ వద్ద ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సులను పిల్లలకు ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన తల్లితో కలిసి క్రిస్టమస్ జరుపుకుంది. తలపై క్రిస్మస్ టోపీతో తల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో ఆకట్టుకుటోంది.
క్రిస్మస్ సందర్భంగా రణ్‌బీర్ (Ranbir Kapoor) – అలియా (Alia Bhatt) జంట మరోమారు తళుక్కుమంది. కూతురు రాహాతో కలిసి వారు సంతోషంగా దిగిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) క్రిస్మస్ రోజున సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో దిగిన ఫొటో ప్రత్యేకంగా నిలుస్తోంది. వారిద్దరు క్రిస్మస్ ట్రీ ఎదుట ఫొటోకు ఫోజులిచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ క్యాప్‌తో భార్య, కూతురుతో అతడు దిగిన ఫొటో క్రికెట్ లవర్స్‌ను తెగ మెప్పిస్తోంది.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయ (Sivakarthikeyan) తన కుమారుడు గుగన్ దాస్‌తో పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రిస్మస్ ట్రీ ముందు కుమారుడితో అందమైన సెల్ఫీ దిగి నెట్టింట పోస్టు చేశాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), భార్య లావణ్య త్రిపాఠితో కలిసి విదేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నాడు. ధ్రువపు జింకతో వారు జిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Hassan).. క్రిస్మస్ ట్రీతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫొటో నెటిజన్లను మెప్పిస్తోంది.
తెలుగు హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) క్రిస్మస్ రోజున చాలా సంతోషంగా గడిపింది. వివిధ రకాల ఫోజుల్లో క్రిస్టమస్ చెట్టుతో ఫొటోలు దిగింది. వాటిని మీరూ చూసేయండి.
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఇంట్లోనే క్రీస్తు పండగను చేసుకుంది. క్రిస్మస్ ఎంతో ఉత్తేజకరమైన రోజని ఆమె పేర్కొన్నారు.
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) తలపై శాంటా క్లాజ్ హెయిర్ బాండ్ పెట్టుకొని పోస్టు చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది.
టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. పారిస్ నగరంలో క్రిస్మస్‌ను ఘనంగా చేసుకుంది. ఈఫిల్ టవర్ కనిపించేలా ఆమె దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ (Amrita Aiyer) క్రిస్మస్ ట్రీ పక్కన ఎంతో అందంగా ఫొటో దిగింది. క్రిస్మస్ వెలుగుల మధ్య ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అందాల భామ హన్సిక (Haniska) ఈ పండగ సందర్భంగా తళుక్కున మెరిసింది. క్రిస్మస్ చెట్టు, శాంటా క్లాజ్ బొమ్మ పక్కన ఎంతో స్టైలిష్‌గా ఫొటో దిగింది.
ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ (Ray Lakshmi) క్రిస్మస్ వెలుగుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. ఫ్యాన్స్‌ను ఉత్తేజపరుస్తూ ఆమె ఇచ్చిన ఫోజు మెప్పిస్తోంది.
‘గద్దల గణేష్’ ఫేమ్ మృణాళిని రవి (Mirnalini Ravi).. విదేశాల్లో క్రిస్మస్ పండుగను ఆస్వాదించింది. అక్కడి వీధుల్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆమె దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నటి రుక్సార్ ధిల్లాన్ (Ruksar Dillon) కూడా ఘనంగా జరుపుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం