ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇటీవల కల్కీ మూవీ యూనిట్.. ‘బుజ్జి’ అనే కొత్త క్యారెక్టర్‌ను ఓ స్పెషల్ ఈవెంట్ ద్వారా పరిచయం చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు ఫ్రెండ్‌గా చేసిన ఓ రోబోటిక్ వెహికల్‌ను హీరో ప్రభాస్ స్వయంగా నడిపి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కార్లను అమితంగా ఇష్టపడే స్టార్ హీరో నాగ చైతన్య కన్ను.. బుజ్జిపై పడింది. అప్పుడు అతడు ఏం చేశాడో ఈ కథనంలో పరిశీలిద్దాం.
బుజ్జిని డ్రైవ్ చేసిన చైతూ
హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు కార్లు అంటే యమా క్రేజ్. మార్కెట్‌లోకి ఏ కొత్త స్పోర్ట్స్ కారు వచ్చిన కొనేందుకు అతడు ఆసక్తి కనబరుస్తాడు. అయితే తాజాగా బుజ్జి అనే స్పెషల్ మేకింగ్ వెహికల్‌పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో చైతూ దృష్టి దీనిపై పడింది. ఇంకేముందు తాను ఓసారి బుజ్జిని నడపాలని నిర్ణయించుకొని చైతూ చిత్ర యూనిట్ సంప్రదించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో చైతూ ఆ కారును నడిపి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును చైతు డ్రైవ్ చేసాడు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్‌లో షేర్ చేయగా నాగచైతన్య దానిని రీట్వీట్ చేశాడు.
This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl
— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024
‘ఇంజనీరింగ్ అద్భుతం..’
కల్కి మేకర్స్ షేర్ చేసిన వీడియోను రీట్విట్ చేస్తూ.. బుజ్జిని నడిపిన అనుభవాన్ని నాగ చైతన్య తెలియచేశాడు. తమ విజన్‌ను విజయవంతంగా రియాలిటీలోకి అనువదించినందుకు మెుత్తం టీమ్‌కి నాగ చైతన్య హ్యాట్సఫ్ చెప్పాడు. నిజంగా ఇదోక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జి కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంజనీరింగ్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మెుత్తంగా బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Witness the epic entry of Bhairava (#Prabhas) with Bujji at the #Bujji event! Feel the energy and excitement! ❤️🔥 @deepikapadukone @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms#BhairavaEntry #Tollywood #EventHighlights #Kalki2898AD #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin… pic.twitter.com/XaQJvWvoqa
— SIIMA (@siima) May 22, 2024
బుజ్జి ప్రత్యేకతలు ఇవే
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
#Bujji has arrived! 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #ActorPrabhas @deepikapadukone @DishaPatani @VyjayanthiFilms @DjokerNole pic.twitter.com/IDYUiFMHNz
— INOX Movies (@INOXMovies) May 23, 2024
రూ. 600 కోట్ల బడ్జెట్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్