NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?

    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?

    June 13, 2024

    టాలీవుడ్‌లో సినిమా – సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), మాస్‌ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది. 

    బాలయ్య vs రవితేజ

    నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘NBK 109’ చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్‌ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్‌ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్‌ త్వరగా షూట్‌ చేసి సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ – దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఫుల్‌ ఫోకస్‌ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని హరీష్‌ శంకర్‌ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య – రవితేజ బాక్సాఫీస్‌ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి. 

    గతంలో బాలయ్యదే పైచేయి

    బాలకృష్ణ – రవితేజ బాక్సాఫీస్‌ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    దేవర నుంచి గట్టిపోటీ తప్పదా?

    తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. ‘దేవర’ను సైతం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని కొరటాల టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

    ‘NBK109’ నుంచి క్రేజీ గ్లింప్స్‌

    నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్‌  గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. “దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు” అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్‌ చూసేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version