ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) సరికొత్త మెుబైల్‌తో రాబోతోంది. ‘Oppo Find X7’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే నయా ఒప్పో ఫోన్ తిరుగులేని ఫీచర్లతో వస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో Oppo Find X7కు సంబంధించి లీకైన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
మూడు వేరియంట్లు
ఒప్పొ తన నయా సిరీస్‌ను మూడు వేరియంట్లలో లాంచ్ చేనుంది. Oppo Find X7, Find X7 Pro, Find X7 Ultra మోడల్స్‌లో ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది.
మెుబైల్ స్క్రీన్
Oppo Find X7 స్మార్ట్‌ఫోన్.. 6.55 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 1080 x 2400 పిక్సెల్ క్వాలిటీతో పాటు 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుందని సమాచారం. Find X7 మోడల్ MediaTek Dimensity 9300 SoC ప్రొసెసర్‌పై, Find X7 Pro వేరియంట్ Snapdragon 8 Gen 3 SoCపై వర్క్ చేయనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ర్యామ్ & స్టోరేజ్
Oppo Find X7 మెుబైల్.. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. మరో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో కూడా ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
బ్యాటరీ
Find X7 సిరీస్‌ను శక్తివంతమైన బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 5000 mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్ చేస్తారని సమాచారం. దీనికి ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తారని తెలుస్తోంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం.
కెమెరా
నయా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరాతో తీసుకొస్తున్నారు. 50MP Sony LYT900 ప్రైమరీ కెమెరా + 50MP Sony IMX 890 సెన్సార్ + 50MP టెలిఫొటో సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఫోన్ ముందు భాగంలో ఉండనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
కలర్ ఆప్షన్స్
OPPO Find X7 మెుబైల్‌ను మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. నలుపు (Black), తెలుపు (White), గోల్డ్ (Gold) రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ధర ఎంతంటే?
OPPO Find X7 మెుబైల్ విడుదల తేదీ, ధరను తయారీ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజయ్యే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.85,499 వరకూ ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం