సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ నగరానికి ఏమైంది
సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
జాతిరత్నాలు
ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
డీజే టిల్లు
డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.
హుషారు
మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
బ్రోచెవారెవరురా
స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు.
ఒకే ఒక జీవితం
టైమ్ ట్రావెల్ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది.
మిషన్ ఇంపాజిబుల్
చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
హృదయం
కాలేజ్ లైఫ్, లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
చిచ్చోరే
ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది.
రొమాంచనమ్
హారర్ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు.
మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్ చేయండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!