Poco M6 Pro: పోకో నుంచి చీపెస్ట్‌ 5G మెుబైల్‌.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్న ఫోన్స్‌. ప్రత్యేకతలు మీరే చూడండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Poco M6 Pro: పోకో నుంచి చీపెస్ట్‌ 5G మెుబైల్‌.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్న ఫోన్స్‌. ప్రత్యేకతలు మీరే చూడండి!

    Poco M6 Pro: పోకో నుంచి చీపెస్ట్‌ 5G మెుబైల్‌.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్న ఫోన్స్‌. ప్రత్యేకతలు మీరే చూడండి!

    August 24, 2023

    పోకో ఇండియా రిలీజ్ చేసిన ‘పోకో ఎం6 ప్రో 5జీ’ (Poco M6 Pro 5G) సంచలనాలు సృష్టిస్తోంది. ఆగస్టు 9న ఈ మెుబైల్‌ మెుదటి సేల్ ప్రారంభం కాగా, తొలి 15 నిమిషాల్లో మొత్తం ఫోన్లు అమ్ముడుపోయాయి. ఆగస్ట్ 12న రెండో సేల్‌ నిర్వహించగా అదే స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో తాజాగా ఆ సంస్థ మూడో సేల్‌ను ప్రారంభించింది. ఫలితంగా ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి సేల్ ప్రారంభమైంది. చీపెస్ట్‌ 5G మెుబైల్‌ కావడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు మెుబైల్‌ ప్రియులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.79 అంగుళాల డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 + MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌ వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది.

    స్టోరేజ్‌ సామర్థ్యం

    Poco M6 Pro 5G  స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో మీ అవసరాన్ని బట్టి ర్యామ్‌, స్టోరేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. దీంతో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ వాడుకోవచ్చు. 

    కెమెరా క్వాలిటీ

    పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ ఏఐ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాల సాయంతో నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    బిగ్‌ బ్యాటరీ

    Poco M6 Pro 5G మెుబైల్‌ను బడ్జెట్‌ రేంజ్‌లోనే తీసుకొచ్చినప్పటికీ బ్యాటరీ విషయం రాజీ పడలేదు. 5,000mAh బిగ్‌ బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్ చేశారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ కూడా చాలా బాగుంటుందని కంపెనీ చెబుతోంది. 

    కలర్స్‌

    Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో మీకు నచ్చిన కలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను వేరియంట్ల ఆధారంగా నిర్ణయించారు. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను కేవలం రూ.9,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version