Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!

    Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!

    July 30, 2024

    గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్‌ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్‌ ఆడియన్స్‌కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఆ మూడు చిత్రాలు లోడింగ్‌..!

    ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్‌ స్టార్‌ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ లైనప్‌లో ఐదు బిగ్‌ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్‌ మారుతీతో ‘రాజా సాబ్‌’ (Raja Saab), సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్‌’ను 2025 ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్‌ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్‌ నెలలో) రిలీజ్‌ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్‌ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

    వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు!

    ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్‌ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్‌ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్‌ నుంచి ‘ఆదిపురుష్’, సలార్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్‌ డిసెంబర్‌లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్‌ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్‌ చేయడానికి తారక్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు తడబడుతుంటే ప్రభాస్‌ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

    రేసుకు తెరలేపిన ప్రభాస్‌!

    ప్రభాస్ అప్‌కమింగ్‌ చిత్రం ‘రాజా సాబ్‌’ను 2025 సమ్మర్‌ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్‌ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య ‘తండేల్‌’ (Thandel), నాగార్జున – ధనుష్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘కుబేర’ (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యష్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ (Toxic) కూడా సమ్మర్‌ -2025 టార్గెట్‌గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్‌ నటిస్తున్న ‘సికిందర్‌’ కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్‌ సినిమా డేట్‌ను లాక్‌ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్‌లోనే రిలీజ్‌ అవుతాయా? లేక ప్రీపోన్‌ లేదా పోస్ట్‌ పోన్‌ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version