Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?

    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?

    May 17, 2024

    టాలీవుడ్‌ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్‌’ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న డార్లింగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్‌ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి. 

    ‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్‌గా ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్‌ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

    అసలు నిజం ఇదే!

    ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్‌ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్‌ చేశారు. అలాగే కమల్‌ హాసన్‌ రోల్‌ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డార్లింగ్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. 

    కమల్‌ అంటే చాలా ఇష్టం

    ప్రభాస్‌ ఫేవరేట్‌ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ముందు వరుసలో ఉంటారు. కమల్‌పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్‌ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్‌.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

    నెలాఖరులో ఫస్ట్‌ సింగిల్‌!

    కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా మ్యూజికల్‌ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ కూడా విడుదల చేయనున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్‌ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version