దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్.. రీసెంట్గా ‘సలార్’ (Salaar)తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా!
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.
ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్?
సలార్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. మరో రెండు నెలల్లో మే 9న ‘కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.
హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కానుండగా హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవే!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి