టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే వీరి పెళ్లికి సంబంధించి వార్తలు సైతం షికారు చేశాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అటు స్వీటీ సైతం ‘ఘాటీ’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం (నవంబర్ 8) అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని ఘాటీ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చింది. అయితే ఈ రెండు పోస్టర్లు సిమిలర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నోటిలో సిగార్‌తో..
అనుష్క శెట్టి ఫీమేల్ లీడ్‌గా ‘ఘాటి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో అనుష్క చాలా డిఫరెంట్‌గా కనిపించింది. ముఖంపై రక్తంతో సిగార్ తాగుతూ ఆ పొగ మధ్యలో కనిపించింది. ఇటీవల వచ్చిన రాజాసాబ్ పోస్టర్‌లోనూ ప్రభాస్ ఈ తరహా గెటప్‌లోనే కనిపించడం గమనార్హం. అనుష్క తరహాలోనే నోట్లో సిగార్ పెట్టుకొని కనిపించాడు. స్మోకీ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇద్దరూ సిగార్ తాగుతూ పోస్టర్‌లో కనిపించడంతో ఆ పోస్టర్లు పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ ట్యాగ్‌లు ఇస్తున్నారు అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
కసిగా తల తెంపిన అనుష్క
గురువారం ఉదయం ‘ఘాటి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అదే రోజు సాయంత్ర సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా చాలా వైలెంట్‌గా స్వీటిని చూపించారు. అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని, అది కూడా బస్ మిర్రర్‌లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా సిగార్ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. అది తాగే సమయంలో అనుష్క చేతుల నిండా రక్తం ఉంటుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్‌ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది.
స్వీటీ ఆశలన్నీ ‘ఘాటి’ పైనే!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది ఆమె స్థాయికి తగ్గ హిట్ మాత్రం కాదు. దీంతో ఇండస్ట్రీలో తిరిగి నిలదొక్కుకోవాలంటే ‘ఘాటి’ సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరోవైపు దర్శకుడు క్రిష్‌కు సైతం ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఇటీవల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ చేజారడంతో ఘాటీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని క్రిష్ భావిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ