రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్ హిరానీ – ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘NTR 31’ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ‘సలార్ 2’ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి