‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో ప్రభాస్ (Prabhas) లుక్ జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్ ఫెయిలవుతూ వస్తోందని మండిపడుతున్నారు. అటు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలు సైతం మండిపడ్డారు. ప్రభాస్‌కు మద్దతుగా నిలుస్తూ యువ హీరోలు సుధీర్ బాబు, ఆది గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..!
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘కల్కి’ తాను చూశానని మూవీ తనకు నచ్చలేదని అర్షద్ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్ జోకర్‌లా ఉంది. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సుధీర్ బాబు.. స్ట్రాంగ్ కౌంటర్!
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం సుధీర్ బాబు వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. సుధీర్ బాబు వ్యాఖ్యలను ప్రభాస్ ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు.
‘ప్రభాస్ అంటే అసూయేమో’
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సిపై యంగ్ హీరో ఆది సాయికుమార్ కూడా తనదైన రీతిలో స్పందించాడు. అర్షద్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కల్మషం లేని మంచి మనసుకు కలిగిన ప్రభాస్ గురించి ఇలా అనుచితంగా మాట్లాడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
‘ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కనిపిస్తోంది’
అర్షద్ వర్సీ వ్యవహారంపై తెలుగు డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన పోస్టు కూడా ఆకట్టుకుంటోంది. ‘సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు ప్రభాస్. ఇండియన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆయన మీద, ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ మీ కంట్లోనే నాకు కనిపిస్తోంది. ప్రతీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. మీ మీ అభిప్రాయాాల్ని చెప్పడానికి ఓ పద్దతి పాడు ఉంటాయ్. మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తోంది’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా, కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపిక పదుకొనే కీలక పాత్రలు పోషించారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి