Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!

  Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!

  April 18, 2024

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పుప్ప2. తొలి పార్ట్‌ సూపర్ హిట్ కావడంతో ఈచిత్రాన్ని  పాన్‌ ఇండియా రేంజ్‌లో  దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి వినిపిస్తున్న లెటెస్ట్ బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప  తరువాతే ఉన్నారని చెప్పవచ్చు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు కొనుగోలు అయితే.. దేవర 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప రూల్ ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. మరోవైపు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Rights) హక్కుల కొనుగోలుపై కూడా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి.

  RRR రికార్డు బ్రేక్

  తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 ది రూల్ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫిక్స్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల కోసం రూ.275 కోట్ల భారీ డీల్‌ను మూవీ మేకర్స్‌తో కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఇండియాలోనే అత్యధికమైన డీల్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మరే చిత్రం ఈ స్థాయిలో అమ్ముడుపోలేదని చెబుతున్నారు. పుష్ప2కు ముందు.. RRR చిత్రం ఓటీటీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో అల్లు అర్జున్ RRR రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ కలిసి రూ.350 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఇందులో మెజార్టీ వాటను నెట్‌ ఫ్లిక్స్ చెల్లించింది. అయితే మొత్తం పుష్ప 2 డీల్ కంటే తక్కువ అని తెలిసింది. RRR చిత్రాన్ని కన్నడ మినహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ5 కన్నడ భాష ప్రసార హక్కులను దక్కించుకుంది. అయితే పుష్ప 2 ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని భాషాల్లో స్ట్రీమింగ్ చేయనుందో తెలియాల్సి ఉంది. RRR సినిమా మాదిరి మెజారిటీ భాషల్లో ప్రసారం చేస్తుందా? లేక అన్ని భాషల్లో ప్రసార హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది.

  తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

  మరోవైపు పుష్ప 2 థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ కోసం దాదాపు రూ.200కోట్లకు బయ్యర్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది.

  టీజర్‌తో భారీ హైప్

   పుష్ప 2 పై ఉన్న క్రేజ్ అభిమానుల్లో మాములు లెవల్లో అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని సర్వత్రా కలిగించింది. టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. 

  పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే?

  పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, రావు రమేష్, ఫహద్ పాసిల్ అలాగే అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version