Pushpa 2: ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ ప్లాన్‌ లీక్‌? వారానికో అప్‌డేట్‌తో మోత మోగాల్సిందే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ ప్లాన్‌ లీక్‌? వారానికో అప్‌డేట్‌తో మోత మోగాల్సిందే!

    Pushpa 2: ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ ప్లాన్‌ లీక్‌? వారానికో అప్‌డేట్‌తో మోత మోగాల్సిందే!

    October 15, 2024

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్లాన్స్‌ చేస్తుండటంతో ఈ సినిమా రిలీజ్‌కు మరో 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజులు పుష్ప 2 ప్రమోషన్స్‌తో మోతమోగుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

    ‘పుష్ప 2’ ఫీవర్‌!

    ‘పుష్ప 2’ రిలీజ్‌ నేపథ్యంలో రానున్న మూడు నెలలు పుష్పగాడి ఆట షూరూ అవుతుందని బన్నీ ఫ్యాన్స్‌ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. #Pushpa2 హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తూ పుష్ప 2 ప్రమోషన్స్‌ను ముందే ప్రిడిక్ట్‌ చేస్తున్నారు. ఇకపై వారానికి ఒక అప్‌డేట్‌ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు రిలీజ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ప్రిడిక్ట్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 డిసెంబర్‌ 6న కాకుండా ఒక రోజు ముందే రిలీజ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం డిసెంబర్‌ 4న ఓవర్సీస్‌లో ఎర్లీ ప్రీమియర్స్ ఉంటాయని పేర్కొంటున్నారు. అదే రోజు రాత్రి నార్త్‌లో 9:30కి ప్రీమియర్‌ షోస్‌ ఉంటాయని చెబుతున్నారు. ఇక తెలుగు స్టేట్స్‌లో డిసెంబర్‌ 5న 1 AMకు ప్రీమియర్స్ వేస్తారని ప్రిడిక్ట్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 5 ఉదయం నుంచి బెన్‌ఫిట్‌ షోతో పుష్ప 2 గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుందని తెలియజేస్తున్నారు. 

    హైప్‌ పెంచేసిన దేవిశ్రీ

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్‌ అద్భుతం అంటూ సినిమాపై హైప్‌ పెంచేశారు. అటు ‘పుష్ప 2’ నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు. 

    నవంబర్ సెకండ్‌ వీక్‌లో ట్రైలర్!

    ‘పుష్ఫ 2’ ప్రమోషన్లను నిర్మాతలు భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు సమాచారం. నవంబర్ రెండో వారంలో ట్రైలర్‌ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రూ.650 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే దాదాపు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే ఈ సినిమా బ్రేక్ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌లో ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో జస్ట్ యావరేజ్‌ టాక్‌ వచ్చినా ఈజీగా లాభాల్లోకి అడుగుపెట్టేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

    మృణాల్‌తో ఐటెం సాంగ్‌!

    ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ  అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్‌ సాంగ్‌ కోసం మృణాల్‌ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్‌ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    కీలకంగా ‘పుష్ప 2’ క్లైమాక్స్‌!

    ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై పతాక సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేస్తారని సమాచారం. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ సుదీర్ఘంగా కొనసాగుతుందని టాక్‌ వినిపిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version