Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?

    Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?

    March 21, 2024

    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ‘రాజమౌళి’ (SS Rajamouli) ఒకరు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ (Ramcharan) నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) స్క్రీనింగ్‌ కోసం ఇటీవలే రాజమౌళి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని గురించి రాజమౌళి కుమారుడు కార్తికేయ (Karthikeya) స్వయంగా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    కార్తికేయ ఏమన్నారంటే?

    ప్రస్తుతం రాజమౌళి.. జపాన్‌లో ఫ్యామిలితో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న బిల్డింగ్‌ మెుత్తం ఒక్కసారిగా ఊగిపోయినట్లు రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ‘జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంత సేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌‌‌ను ఫోటోను కార్తికేయ ఈ పోస్టుకు జత చేశారు. 

    ధైర్యం చెప్పిన జపనీయులు

    అయితే భూకంపం చూసి కాస్త ఆందోళన చెందిన రాజమౌళి ఫ్యామిలీ (SS Rajamouli Family)కి స్థానిక జపానీయులు  ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమేనని పేర్కొన్నారట. వచ్చింది భారీ భూప్రకంపనలు కాదూ అంటూ వారిని కూల్‌ చేసే ప్రయత్నం చేశారట. అటు కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌‍గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3 రిక్టర్‌ స్కేల్‌పై నమోదైంద. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రాంతంలో గల ప్రిఫెక్చర్స్ ఏరియాలో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం.

    రాజమౌళికి అదిరే ఆతిథ్యం

    ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపనీయులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపనీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చారు. ఒక పెద్దావిడ అయితే రాజమౌళి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా రాజమౌళి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఓ ఇండియన్ సినిమాకి జపాన్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌తో తాను తీయబోతున్న చిత్రం విశేషాలు కూడా వారితో పంచుకున్నారు. సినిమా రిలీజ్‌ సమయానికి మహేష్‌ను కూడా తీసుకొచ్చి ప్రమేషన్స్‌ చేస్తానని జపనీయులకు దర్శకధీరుడు మాట కూడా ఇచ్చారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version