Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?

  Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?

  May 2, 2024

  స్టార్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాట.. వెలువడే ట్వీట్‌ ప్రతీది హాట్‌ టాపిక్‌గా మారిపోతుంటాయి. ఇక వ్యక్తులను టార్గెట్‌ చేసి ఆయన చేసే సెటైరికల్‌ కామెంట్స్‌ కూడా ఓ రేంజ్‌లో చర్చకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా ఆర్జీవీ పెట్టిన పోస్టు ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఎంతో అభిమానించే దివంగత నటి శ్రీదేవికి సంబంధించి ఈ పోస్టు పెట్టడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. 

  ‘స్వర్గంలో శ్రీదేవిని కలిశా..’

  ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi)ని.. రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతగానో ఆరాధించేవాడు. ఆమెను ఆర్జీవీ మనస్పూర్తిగా ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్‌ ఉండేది. ఇందుకు అనుగుణంగానే చాలా ఇంటర్యూల్లో శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని ఆర్జీవీ బహిరంగంగానే తెలియజేశాడు. అయితే చనిపోయిన శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆర్జీవీ పెట్టిన AI ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను’ అంటూ ఆర్జీవీ ఆ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. పైగా ఈ ఫొటోలో ఆర్జీవీ సిగరేట్ తాగుతూ కెమెరాకు ఫోజు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

  ‘చనిపోయినా వదలవా’

  ఆర్జీవీ తాజా పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ పోస్టును సమర్థిస్తుంటే ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఇలా ఎడిటింగ్‌ చేసి పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. శ్రీదేవిపై ఇష్టం ఉంటే ఉండొచ్చు గానీ, ఇలా మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టి సోషల్‌ మీడియాలో వైరల్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చనిపోయినా కూడా శ్రీదేవిని వదలవా అంటూ నిలదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీదేవిని ఆర్జీవి మర్చిపోలేకపోతున్నాడని అంటున్నారు. ఇలా ఆమెకు సంబంధించిన పోస్టులు పెట్టి శ్రీదేవి జ్ఞాపకాలను ఆర్జీవీ గుర్తు చేసుకుంటున్నాడని పేర్కొంటున్నారు. 

  ఆర్జీవీ ఫస్ట్‌ లవ్‌ ఈమే!

  ఆర్జీవీ మనసుకు నచ్చిన మహిళ శ్రీదేవి కంటే ముందు ఒకరున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆర్జీవీనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు ఆమె బికినీలో ఉన్న ఫొటోలను సైతం షేర్‌ చేసి తన ఫ్యాన్స్‌కు పరిచయం చేశాడు. ‘బ్లూకలర్ స్విమ్‌ సూట్‌లో ఉన్న సత్య అనే మహిళ.. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు తన ఫస్ట్ లవ్‌ అని ఆర్జీవీ చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో వైద్యురాలిగా స్థిర పడినట్లు తెలిపాడు. తాను తీసిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పేరు కూడా సత్య అని ఆర్జీవీ గుర్తుచేశాడు. అలాగే తనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘సత్య’ మూవీ కూడా ఉందని అన్నాడు. 

  రంగీలా స్టోరీ అలా వచ్చిందే!

  డా. సత్యతో తనకున్న ఓ క్యూట్ మూమెంట్‌ను కూడా అప్పట్లో ఆర్జీవీ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తాను చదివే రోజుల్లో సిద్ధార్థ కాలేజీలో మెడికల్‌ & ఇంజనీరింగ్‌ విభాగాలు ఒకే కాంపౌండ్‌లో ఉండేవని ఆర్జీవీ తెలిపాడు. కొన్ని సంఘటనల తర్వాత సత్యను వన్‌సైడెడ్‌గా లవ్‌ చేయడం మెుదలు పెట్టానని పేర్కొన్నాడు. కానీ ఆమె తనను పట్టించుకోలేదని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆమె డబ్బున్న యువకుడితో సన్నిహితంగా ఉండేదని ఆర్జీవీ తెలిపాడు. ఈ అనుభవం నుంచే రంగీలా స్టోరీ పుట్టిందని గతంలో స్పష్టత ఇచ్చాడు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version