టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా.. సహజీవనం మాత్రం చేస్తున్నారంటూ తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో విజయ్, రష్మికలు షేర్ చేసుకున్న సోషల్ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.
విజయ్, రష్మికలు సీక్రెట్‌గా వియత్నాం వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ విడివిడిగా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో వీరిద్దరూ పలుమార్లు విడివిడిగా ఫోటోలను షేర్ చేశారు. దీంతో వీరు లివింగ్ రిలేషన్‌షిప్ (సహజీవనం) చేస్తున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే వారు పెళ్లికి ఆసక్తి చూపడం లేదని చెప్పుకొస్తోంది.
విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ గురించి వార్తలు కూడా ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విజయ్, రష్మిక ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే విజయ్ టీమ్ మాత్రం అవి కేవలం రూమర్స్ మాత్రమేనని ఇందులో నిజం లేదని కొట్టిపారేసింది.
అయితే విజయ్, రష్మిక రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు చాలా హ్యాపీగా ఉన్నారని ఇప్పట్లో ఎంగేజ్‌మెంట్ చేసుకునే ఆలోచన వారికి లేదని తెలిపారు. ఈ జంట ఫోకస్ ప్రస్తుతం కెరీర్‌పై ఉందని, సినిమాల్లో నటిస్తూ బిజీగా వారు ఉన్నారని గుర్తుచేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రష్మిక.. రణబీర్ కపూర్‌తో జోడీకడుతూ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ‘యానిమల్’ వరల్డ్‌లో గీతాంజలి పాత్రలో రష్మిక నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యానిమల్ సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు ఉన్నాయి.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సమంతతో చేసిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.
విజయ్ ప్రస్తుతం ‘గీతా గోవిందం’ డైరెక్టర్ పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!