Realme 12X 5G vs Moto G34 5G: ఈ రెండు బడ్జెట్‌ మెుబైల్స్‌లో ఏది కొంటే బెటర్‌?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme 12X 5G vs Moto G34 5G: ఈ రెండు బడ్జెట్‌ మెుబైల్స్‌లో ఏది కొంటే బెటర్‌?

    Realme 12X 5G vs Moto G34 5G: ఈ రెండు బడ్జెట్‌ మెుబైల్స్‌లో ఏది కొంటే బెటర్‌?

    March 28, 2024

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ కంపెనీ రియల్‌మీ (Realme) మరో బడ్జెట్‌ ఫోన్‌తో భారత్‌లో అడుగు పెట్టబోతోంది. Realme 12X 5G పేరుతో కొత్త ఫోన్‌ను ఏప్రిల్‌ 2న లాంచ్ చేయనుంది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను సైతం కంపెనీ రివీల్‌ చేసింది. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన Motorola Moto G34 పోటీగా ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒకే ప్రైస్‌ సెగ్మెంట్‌లో ఈ రెండు మెుబైల్స్‌ ఉండటంతో పాటు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది కొంటే బెటర్‌? వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిశీలిద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Realme 12x మెుబైల్‌.. 6.67 అంగుళాల IPS LCD స్క్రీన్‌తో వస్తోంది. దీనికి 1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ అందించారు. ఈ ఫోన్‌ Android 14 ఆధారిత  Realme UI 5.0 OS, Mediatek Dimensity 6100+ ప్రొసెసర్‌పై పని చేయనుంది. అటు Motorola Moto G34 మెుబైల్‌.. 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 720 x 1600 pixels రిజల్యూషన్‌, Android 13 ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌, Snapdragon 695 5G ప్రొసెసర్‌ను ఇది కలిగి ఉంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ Realme 12x మెుబైల్‌.. రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. 12GB RAM / 256GB ROM , 12GB RAM / 512GB స్టోరేజ్‌తో రావొచ్చని అంచనా. అటు Motorola Moto G34 ఫోన్‌.. నాలుగు స్టోరేజ్‌ వేరియంట్లతో లభిస్తోంది. 4GB RAM + 64GB, 4GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో దీనిని పొందవచ్చు. 

    బ్యాటరీ

    Realme 12x స్మార్ట్‌ఫోన్‌.. Li-Po 5000mAh బ్యాటరీతో భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. దీనికి 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మద్దతును అందించినట్లు కంపెనీ ప్రకటించింది. మరోవైపు మోటోరోలా ఫోన్‌ కూడా ఇదే సామర్థ్యం (5000 mAh) కలిగిన బ్యాటరీతో వచ్చింది. అయితే ఈ ఫోన్‌కు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును మాత్రమే అందించడం గమనార్హం. 

    కెమెరా 

    సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా కెమెరా ఫీచర్‌ కీలకం. Realme 12x మెుబైల్‌.. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఇందులో ఆధారిత 50MP AI కెమెరా ప్రైమరీగా ఉంది. మిగిలిన రెండూ సపోర్టింగ్‌ సెన్సార్లు. ఇక ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కూడా అందించినట్లు రియల్‌మీ ప్రకటించింది. అటు మోటో కెమెరా ఫీచర్‌ విషయానికి వస్తే.. ఇది డ్యూయల్‌ రియర్‌ కెమెరాతో వచ్చింది. 50MP ప్రైమరీ కెమెరా ఇందులో ఉంది. ముందు వైపు సెల్ఫీల కోసం ఏకంగా 16MP కెమెరాను అమర్చడం విశేషం. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ Realme 12x మెుబైల్‌లో.. Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.2, GPS, GALILEO, GLONASS, BDS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌, ప్రాక్సిమిటి, కాంపస్‌ వంటి సెన్సార్లతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి రానుంది. అటు Motorola Moto G34 మెుబైల్‌ కూడా దాదాపుగా ఇదే తరహా కనెక్టివిటీ, సెన్సార్ ఫీచర్లను కలిగి ఉంది. 

    కలర్ ఆప్షన్స్

    Realme 12x స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. డార్క్‌ గ్రీన్‌, గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోటోరోలా మెుబైల్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. చార్‌కోల్‌ బ్లాక్‌, ఐస్‌ బ్లూ, ఓసియన్‌ గ్రీన్‌, వెన్నెల క్రీమ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

    ధర ఎంతంటే?

    Realme 12X 5G మెుబైల్‌ ధర రూ.12,000 లోపు ఉంటుందని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 2న మెుబైల్‌ లాంచింగ్‌ సందర్భంగా స్పష్టమైన ధరను వెల్లడించే అవకాశముంది. మరోవైపు Moto G34 5G ప్రారంభ వేరియంట్‌ ధర రూ.10,999గా ఉంది. 8GB RAM, 128GB మోడల్‌ను రూ. 11,999కు కొనుగోలు చేయవచ్చు. 

    ఏది కొంటే బెటర్‌?

    Realme 12X 5G, Motorola Moto G34 రెండూ సిమిలార్‌ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే కెమెరా, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్‌, ప్రొసెసర్‌ పరంగా చూస్తే లేటేస్ట్‌గా రానున్న Realme 12X 5G బెటర్‌ ఛాయిస్‌గా కనిపిస్తోంది. అయితే సెల్ఫీ కెమెరా విషయంలో మోటోరోలాది పైచేయిగా ఉంది. అలాగే మల్టిపుల్‌ స్టోరేజ్, కలర్‌ ఆప్షన్స్‌ను కూడా Motorola Moto G34 కలిగింది. అయితే బడ్జెట్‌ పరంగా చూస్తే రియల్‌మీ ధర కాస్త మోటోరోలాతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్‌ ఉంది.  కాబట్టి మీ బడ్జెట్‌కు ఏమైనా పరిమితులు ఉంటే డైరెక్ట్‌గా మోటో జీ34ను కొనుగోలు చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version