Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!

    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!

    April 24, 2024

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్‌ కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్లు అందించిన  ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో మెుదలైంది. 

    ఎందుకు కలిశారంటే!

    హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌.. ప్రశాంత్‌ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్‌ 2’లో విజయ్‌ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ ఇంటికి వెళ్లారని సమాచారం. ‘సలార్‌ 2’ క్లైమాక్స్‌లో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్‌ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్‌. అయితే దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

    చిక్కుల్లో విజయ్‌ కెరీర్‌!

    విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్‌ ఖాతాలో పడితే అతడి కెరీర్‌ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పడేనా?

    విజయ్‌(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం ‘VD12’ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్‌ స్టోరీ కావడం, విజయ్‌ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పెడుతుందో లేదో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version