టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం యంగ్ సెన్సేషన్ మమితా బైజును హీరోయిన్‌గా లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ!
‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్ భావించిందట. ఈ ఆఫర్ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్‌తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.
ఆ హీరోయిన్ల సరసన చోటు!
మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్, కీర్తి సురేష్, నివేదా థామస్, మాళవిక మోహనన్ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్ ఆడియన్స్.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.
మమితాపై ఆసక్తికి కారణమదేనా?
‘VD 12’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్ ప్రేక్షకులకు ‘VD12’ చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడం.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!