Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్

    Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్

    April 24, 2024

    భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr. NTR) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్‌ సహా గ్లోబల్‌ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టింది. హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ జేమ్స్ కామెరాన్ (James Cameron) సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తనకు బాగా నచ్చినట్లు ప్రకటించారు. అటువంటి RRR చిత్రంపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ (Adil Hussain) నోరు పారేసుకున్నారు. దక్షిణాది చిత్రంపై తన అక్కసు వెళ్లగక్కాడు. 

    RRR గొప్ప చిత్రం కాదు’

    బాలీవుడ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సేన్‌.. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అస్సామీ నటుడికి యాంకర్‌ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ప్రాంతీయ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో అలరిస్తున్నాయని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాగా త్వరలో అసోం చిత్రాలను కూడా అంతర్జాతీయ వేదికలపై చూడవచ్చా? అని అడిగారు. ఇందుకు ఆదిల్‌ హుస్సేన్‌ సమాధానమిస్తూ.. ‘అస్సామి సినిమా ఇప్పటికే ఆ స్థాయికి (గ్లోబల్‌) చేరుకుంది. నేను RRR గొప్ప చిత్రంగా పరిగణించను. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందిన చిత్రాలు సాధారణంగా మంచి సినిమాలుగా పరిగణింపబడతాయి. అంతమాత్రాన అవి తప్పనిసరిగా గొప్ప చిత్రాలు కావాల్సిన పని లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా అంతే. అది వినోదాత్మక చిత్రం మాత్రమే. నా దృష్టిలో అది గొప్ప చిత్రం కాదు. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే విలేజ్‌ రాక్‌స్టార్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని అన్నారు. 

    నెట్టింట తీవ్ర దుమారం

    RRRపై ఆదిల్‌ హుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు ఆదిల్‌ చేశారంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. సౌత్‌ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో రాణిస్తుండటం చూసి తట్టుకోలేకనే ఇలా మాట్లాడారని మండిపడ్డారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారత చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు మరికొందరు నెటిజన్లు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మంచి ఎంటర్‌టైనింగ్‌ చిత్రమేనని.. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప సినిమా అయితే కాదని పేర్కొంటున్నారు.

    సందీప్ రెడ్డి వంగా మూవీపైనా విమర్శలు!

    యానిమల్‌ (Animal) ఫేమ్‌ అర్జున్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గత చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ పైనా ఆదిల్‌ హుస్సేన్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఎందుకు నటించానా? అని ఫీలైన చిత్రం ఒక్కటే. అదే ‘కబీర్‌ సింగ్‌’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్‌ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకే ఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో యాక్ట్‌ చేసి వచ్చేశా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా? అని ఇబ్బందికరంగా ఫీలయ్యా. స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె చూసి ఉంటే నన్ను తిట్టేది’ అని అన్నారు.

    సందీప్‌ వంగా స్ట్రాంగ్ కౌంటర్‌

    ఆదిల్‌ హుస్సేన్‌ చేసి వ్యాఖ్యలపై డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్‌ చేస్తా’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version