Realme buds T300: రియల్‌మీ నుంచి క్రేజీ ఇయర్‌ బడ్స్‌.. మ్యూజిక్‌ లవర్స్‌కు ఇక పండగే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme buds T300: రియల్‌మీ నుంచి క్రేజీ ఇయర్‌ బడ్స్‌.. మ్యూజిక్‌ లవర్స్‌కు ఇక పండగే!

    Realme buds T300: రియల్‌మీ నుంచి క్రేజీ ఇయర్‌ బడ్స్‌.. మ్యూజిక్‌ లవర్స్‌కు ఇక పండగే!

    September 13, 2023

    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ తాజాగా నార్జో 60ఎక్స్‌ (Realme narzo 60x) మెుబైల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు ఇయర్‌ బడ్స్‌ను సైతం భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. రియల్‌మీ టీ300 (Realme buds t300) పేరిట ఈ ఇయర్‌ బడ్స్‌ను తీసుకురానుంది. ఇవి మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. రియల్‌మీ టీ300 ద్వారా సాంగ్స్‌ వింటే కొత్త అనుభూతిని పొందుతారని చెబుతోంది. నిజంగానే ఈ ఇయర్‌ బడ్స్‌లో అంత ప్రత్యేకత ఉందా? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. 

    అద్భుతమైన బేస్‌

    Realme buds t300 ఇయర్ బడ్స్‌ను 12.4mm డైనమిక్‌ BASS స్పీకర్లతో తీసుకొస్తున్నారు. అలాగే బయటి శబ్దాలు వినపడకుండా చేసే 30db యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ సపోర్ట్‌ను వీటికి అందించారు. 4 మైక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం కూడా ఇందులో ఉండనుంది. వీటి సాయంతో ఎలాంటి డిస్టబెన్స్‌ లేకుండా క్రిస్టల్‌ క్లియర్‌గా మ్యూజిక్‌ ఆస్వాదించవచ్చు. 

    360 డిగ్రీ సౌండ్‌ ఎఫెక్ట్‌

    Realme buds t300లో ఉపయోగించిన అడ్వాన్స్‌డ్‌ సాంకేతికత వల్ల ఈ ఇయర్‌ బడ్స్‌ 360 డిగ్రీ సౌండ్‌ ఎఫెక్ట్‌ను అందించనున్నాయి. దీనివల్ల సాంగ్స్‌ వింటున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్‌ కలుగుతుంది. 

    బ్యాటరీ

    Realme buds t300కి ఇచ్చిన చార్జింగ్ కేస్‌ 460mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 40 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. ఒకటిన్నర గంటల్లోనే కేస్‌ను ఫుల్‌చార్జ్‌ చేసుకోవచ్చు. 

    క్విక్‌ చార్జింగ్‌

    Realme buds t300 ఇయర్‌ బడ్‌ ఒక్కొక్కటి 43 mAh బ్యాటరీతో అమర్చబడి ఉన్నాయి. 10 నిమిషాల క్విక్ చార్జ్‌తో 7 గంటల ప్లే బ్యాక్‌ను ఇవ్వగలవు. దీంతో చార్జింగ్‌ కేస్ అందుబాటులో లేకపోయినా కంగారు పడాల్సిన పరిస్థితి ఉండదు. ఇక ఈ చార్జింగ్ కేస్‌కి USB టైప్-C పోర్ట్‌ను అందించారు. దమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP55 రేటింగ్ కలిగి ఉంది.

    కలర్స్‌

    ఈ ఇయర్‌బడ్స్ రెండు కలర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. స్టైలిష్ బ్లాక్, యూత్ వైట్ అనే రెండు ఆప్షన్‌లలో లభిస్తాయి. కాగా, ఈ ఇయర్‌ బడ్స్‌ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వచ్చాయి.

    ధర ఎంతంటే?

    Realme buds t300 ఇయర్‌ బడ్స్‌ ధరను రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మీ వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేస్తే రూ.100 డిస్కౌంట్‌ పొందవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version