Realme GT 5 Pro: రియల్‌మీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. కెమెరా క్వాలిటీ అదుర్స్..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme GT 5 Pro: రియల్‌మీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. కెమెరా క్వాలిటీ అదుర్స్..!

    Realme GT 5 Pro: రియల్‌మీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. కెమెరా క్వాలిటీ అదుర్స్..!

    October 26, 2023

    రియల్‌ మీ బ్రాండ్‌ నుంచి మరో ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్ ఫోన్ విడుదలకు సిద్ధంగా ఉంది. Realme GT 5 Pro గ్యాడ్జెట్‌ను త్వరలోనే ఇండియన్‌ మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో లీక్స్ వస్తున్నాయి. దీపావళి బరిలో ఈ ఫోన్‌ను దింపాలని రియల్‌మీ యోచిస్తోందని సమాచారం. రియల్‌మీ బ్రాండ్‌కు భారత్‌లో మంచి పేరుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ ఫోన్లకు యూత్‌లో మంచి క్రేజ్ అయితే ఉంది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున లీక్స్ విడుదలవుతున్నాయి. మరి ఆ ఫీచర్స్‌పై ఓ లుక్‌ వేద్దాం పదండి.

    డిస్‌ప్లే: 

    రియల్‌మీ GT 5 Pro స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే BOE సపోర్ట్‌తో OLED స్క్రీన్‌తో రానుంది. 2K రిజల్యూషన్‌తో 144 హెడ్జ్ రీఫ్రెష్ రేటును కలిగి ఉండనుంది. 6.82 అంగుళాల పొడవుతో కర్వ్డ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉండనుంది. సెంట్రల్ పంచ్‌ హోల్‌ను అయితే కలిగి ఉండనున్నట్లు తెలిసింది.

    డిజైన్‌

    ఈ గ్యాడ్జెట్ 10,000mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, మెటాలిక్ మిడిల్ ఫ్రేమ్‌తో డిజైన్ చేయబడింది. లెదర్ బ్యాక్‌తో కూడిన IP68 రెటెడ్‌ వాటర్/డస్ట్ రెసిస్టెన్స్‌ను అయితే కలిగి ఉంటుందని సమాచారం.

    బ్యాటరీ

    రియల్‌ మీ GT 5 Pro.. 5,400mAh బ్యాటరీ కెపాసిటీతో రానున్నట్లు సమాచారం. ఇది వైర్‌లెస్, వైర్‌డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్డ్‌ ఛార్జింగ్ అయితే 100W వద్ద, వైర్‌లెస్‌ అయితే.. 50W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. 1%-80% ఛార్జ్‌ అయ్యేందుకు 40 నిమిషాల సమయం పడుతుందని టాక్. పూర్తి ఛార్జింగ్‌ కోసం 1గంట 7 నిమిషాల వరకు సమయం పట్టనుందట.

    కెమెరా

    ఫ్లాగ్ షిప్ ఫోన్ కావడంతో కెమెరాల మన్నికపై రియల్‌మీ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ గ్యాడ్జెట్ ప్రధాన కెమెరా సర్కిల్ రియర్ సెటప్ కలిగి ఉంది. ప్రధాన కెమెరా 50MP+8MP+2MP కాన్ఫిగరేషన్‌తో రానుంది. దీనిలో ప్రత్యేకంగా Sony IMX966 లెన్స్‌ను ఉపయోగించారు. ఇక సెల్ఫీ కెమెరా టెలిఫోటో 50MP సెటప్‌తో వస్తుంది. ఇది IMX890 లెన్స్‌తో 3X ఆఫ్టికల్ జూమ్‌ను కలిగి ఉంటుంది. రెండు కెమెరాలు ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) ఫీచర్‌తో వస్తున్నాయి. రెండూ కూడా 4K క్వాలిటీతో వీడియోను రికార్డు చేయనున్నట్లు తెలిసింది.

    సాఫ్ట్‌వేర్/ స్టోరేజ్

    GT 5 ప్రో గ్యాడ్జెట్ లెటెస్ట్ చిప్ సెట్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో రానుంది. ఇక దీని ఓఎస్ ఆండ్రాయిడ్ 14పై రన్‌కానుంది. ప్రాథమికంగా ఈ ఫోన్ 12జీబీ ర్యామ్‌తో వస్తుండగా.. దీని 24జీబీ ర్యామ్‌ వరకు పెంచుకునే సౌలభ్యాన్ని పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు టాక్.  ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇన్షియల్‌గా 256జీబీ కెపాసిటీ అందిస్తుండగా.. దానిని 1TB వరకు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

    ధర

    Realme GT 5 Pro ప్రారంభ ధర రూ.45,899 వరకు ఉండే ఛాన్స్‌ ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొబైల్ నవంబర్‌ తొలివారంలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. దీపావళి సెల్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version