నటినటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్
దర్శకత్వం: కదిరేసన్
సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్
సంగీతం: G.V. ప్రకాష్
ఎడిటర్ : ఆంటోని
నేపథ్య సంగీతం: శామ్ C.S
రాఘవ లారెన్స్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి పలు హిట్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ అందుకున్నాయి. దీంతో లారెన్స్ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రుద్రుడు సినిమా ఇవాళ (ఏప్రిల్ 14) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా విజయం సాధించిందా? లారెన్స్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? అసలు సినిమా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
రుద్రుడు (లారెన్స్), అనన్య (ప్రియా భవానీ శంకర్) భార్య భర్తలు. ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే రుద్రుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఆనందంగా సాగిపోతున్న రుద్రుడు జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన భార్యను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేస్తారు. దీంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. తన భార్యను హతమార్చిన వారిని వదిలిపెట్టకూడదని రుద్రుడు నిర్ణయించుకుంటాడు. వారిని ఎలాగైన పట్టుకొని చంపేయాలని వేట మెుదలెడతాడు. అసలు అనన్యను ఎందుకు చంపారు? దుండుగల వెనక ఎవరు ఉన్నారు? విలన్లపై రుద్రుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది అసలు కథ.
ఎవరెలా చేశారంటే:
రుద్రుడు పాత్రలో రాఘవ లారెన్స్ చాలా బాగా నటించాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనదైన నటనతో లారెన్స్ మెప్పిస్తాడు. ఇక డ్యాన్సుల్లో లారెన్స్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా లారెన్స్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీన్స్‌లో లారెన్స్ పర్‌ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అటు ప్రియా భవాని నటన కూడా పర్వేలేదనిపిస్తుంది. ఉన్న కొద్దిసేపైన లారెన్స్‌తో పోటీ పడి మరీ ఆమె నటించింది. ఇక విలన్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి పాత్రకు ప్రాణం పోశాడు.
టెక్నికల్‌గా
డైరెక్టర్ కదిరేసన్ ఒక రొటిన్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడు. నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ సినిమాను ఎప్పుడో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో, హీరోయిన్ లవ్ సీన్స్, పెళ్లి చేసుకోవడం అంతా బాగుందనుకునే లోపే ప్రియా భవానీ హత్య జరగడం పెద్ద సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, ఆ తర్వాత హీరో రీవెంజ్ తీర్చుకునే సన్నివేశాలన్నీ పేలవంగా అనిపిస్తాయి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది. G.V ప్రకాష్ సంగీతం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒకటిమాత్రమే వినసొంపుగా ఉంది. అయితే శామ్ C.S ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
- లారెన్స్ నటన
- నేపథ్య సంగీతం
- పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- రొటిన్ స్టోరీ
- సంగీతం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం