Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!

    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!

    May 9, 2023

    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పాత్రలో గ్లామర్‌ డోస్‌ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్‌ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

    1. భోళా శంకర్‌ (Bhola Shankar)

    చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్‌. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేస్తోంది. అయితే కీర్తి సురేష్‌ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్‌ చేశానని స్పష్టం చేసింది. రీమేక్‌ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తోంది. 

    2. లియో (Leo)

    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడు ‌అంటే ఏ హీరోయిన్‌ ‌అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్‌ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. 

    3. ఛత్రపతి (Chatrapathi)

    యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్‌ వినిపించింది. గ్లామర్‌ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్‌ కానుంది. 

    4. వారసుడు (Varasudu)

    విజయ్‌ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్‌ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు. 

    5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)

    మహేష్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్‌ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

    6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)

    విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్‌ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఆఫర్‌ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్‌ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్‌ ఉండటంతో నో చెప్పింది. 

    7. చెలియా (Cheliya)

    లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్‌ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్‌ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version