Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!

    Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!

    July 13, 2024

    మలయాళ బ్యూటీ సాయి పల్లవి (Actress Sai Pallavi) అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయిన్పపటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న ఈ కాలంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నటన, డ్యాన్స్‌తోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards South 2023) ప్రకటించగా అందులో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.

    ఏకైక హీరోయిన్‌గా ‘సాయిపల్లవి’

    దక్షిణాది సినిమా పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2022, 2023 చిత్రాలను పరిగణలోకి తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో వచ్చిన ‘గార్గీ’ (Gargi) చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అటు తెలుగులో చేసిన ‘విరాట పర్వం’ (Virataparvam) సినిమాకు సైతం క్రిటిక్స్‌ విభాగంలో బెస్ట్‌ ఫీమేల్‌ యాక్టర్‌గా అవార్డు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాదిలో అవార్డు దక్కించిన ఏకైక హీరోయిన్‌గా సాయిపల్లవి చరిత్ర సృష్టించింది. దీంతో సాయిపల్లవిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

    ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

    తమిళ చిత్రం ‘ప్రేమమ్’ (Premam)తో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి (Sai Pallavi) యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ (Fidaa) చేసి భానుమతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ 19 చిత్రాలు చేసిన సాయిపల్లవి ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దక్కించుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ కాలంలో ఆ ఫీట్‌ సాధించిన హీరోయిన్‌గానూ సాయిపల్లవి నిలిచింది. 

    సాయి ప‌ల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు

    • ప్రేమ‌మ్ (2015) – ఉత్త‌మ న‌టి (డెబ్యూ)
    • ఫిదా (2017) – ఉత్త‌మ న‌టి
    • ల‌వ్ స్టోరీ (2021) – ఉత్త‌మ న‌టి
    • శ్యామ్​ సింగ‌రాయ్ (2021) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)
    • గార్గి (2022) – ఉత్త‌మ న‌టి
    • విరాట‌ప‌ర్వం (2022) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

    ప్రేమ చిత్రాలకు చిరునామా

    ‘ప్రేమమ్’ (Premam) తర్వాత నుంచి సాయిపల్లవి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్‌ షోకు పూర్తి వ్యతిరేకంగా, కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్‌’ సహా ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది. 

    ఫుల్‌ స్వింగ్‌లో సాయిపల్లవి

    ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్‌’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్‌’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న ‘రామయణం’ కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే విజయ్‌ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version