Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 

    Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 

    May 1, 2023

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కెరీర్‌లో, జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన ప్రతీ సారి బలంగా పుంజుకుంటోందీ బ్యూటీ. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. 

    సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్. నేచర్ లవర్. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటుంది. సెట్స్ ఫొటోలు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ ఇస్తుంటుంది. సమంత ఇప్పుడెలా ఉందో మనందరికీ తెలుసు. కానీ, చిన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉండేదో ఊహించారా? సామ్ చిన్ననాటి ఫొటోల్లో కొన్నింటిపై ఓ లుక్కేద్దాం.

    ఫ్యామిలీ ఫొటో..

    సామ్‌కి ఇద్దరు సోదరులు. చిన్ననాటి ఫొటోను షేర్ చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. మేమెక్కడున్నా ఇంకా ఒక్కటిగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. స్కై బ్లూ కలర్‌లో ఫ్రాక్ వేసుకుని క్యూట్‌గా ఉంది. 

    కెరీర్ బిగినింగ్‌లో..

    కెరీర్ తొలినాళ్లలో సామ్ ఎలా ఉండేదో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతుంది. 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. 

    క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్..

    చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. చెంపలకు, నుదుట గుండ్రటి కాటుక పెట్టుకుని ఫొటోకు పోజులిచ్చింది. కొప్పు నిండా జాస్మిన్ పూలను పెట్టుకుని ఫొటో దిగింది. 

    పింగ్ గౌను వేసుకుని..

    పింక్ గౌను వేసుకుని ఎంత అమాయకంగా చూస్తుందో..! కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ. 

    అమ్మ చెంతన..

    తన తల్లి గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో సామ్ చెప్పింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని షేర్ చేసుకునేది. ఇదే పింక్ గౌనులో తల్లి ఎత్తుకున్న ఫొటో ఇది. అమ్మ ఎత్తుకుంటే ఆ సంతోషమే వేరు అన్నట్టుగా ముసి ముసిగా నవ్వుతోంది.  

    కరాటే కోసం..

    సామ్ కొన్నాళ్లపాటు కరాటే కూడా నేర్చుకుంది. ఓ చేతిలో కర్ర పట్టుకుని మరొక చేతితో సమరానికి సిద్ధమంటూ పోజు పెట్టింది. వైట్ డ్రెస్ వేసుకుని రెండు జడలతో ఇలా కనిపించింది.

    కాలేజీ రోజుల్లో..

    కాలేజీ రోజుల్లో స్నేహితులతో ఇలా దిగిన ఫొటో ఇది. పింక్ సారీ వేసుకుని సామ్ కనిపించింది.

    మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత వరుసగా షూటింగులకు హాజరవుతోంది. శివనిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. మరోవైపు, సిటాడెల్ వెబ్‌సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం కాల్ షీట్స్ కేటాయించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version