Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ… ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.
ఆదే కారణమా?
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది.
సమంత రాబోయే సినిమాలు
శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
అభిమానుల అండ
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత… కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!