స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె సినిమాల నుంచి కొద్ది కాలం విరామం తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వారిని సామ్ అలరిస్తోంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. సమంత పోస్టు వెనకున్న అర్థం ఏంటో తెలియక ఫ్యాన్స్ తలలు బాదేసుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోస్టులో ఏముందంటే?
స్టార్ హీరోయిన్ సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెట్టిన లేటేస్ట్ పోస్టు.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను దానికోసమే ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ సమంత ఈ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఇది ఎవరి గెలుపును ఆకాంక్షిస్తూ పెట్టానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నాగచైతన్యను ఉద్దేశించి సమంత పెట్టిందంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైతే చాలా బాగుంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
అసలు కారణం ఇదే!
ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇవాళ (మే 22) సెకండ్ ప్లేఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు.. రాజస్థాన్ రాయల్స్ (RR)తో తలపడనుంది. అయితే సామ్ ఆర్సీబీ గెలుపును ఆకాంక్షిస్తూ ఈ పోస్టును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కప్ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని సమంత కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఆ జట్టును ఎంకరేజ్ చేసేందుకు సామ్ ఇలా పోస్టు పెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నేరుగా RCBని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదని అంటున్నారు.
విరాట్‌కు వీరాభిమాని
క్రికెట్‌ను అభిమానించే హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె పలు వేదికలపై తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అంతేకాదు క్రికెట్‌లో తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్ కావడం.. అతడికి ఈ మ్యాచ్ చావో రేవో కావడంతో సమంత ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఇది సమంత పర్సనల్ పోస్టు అని నమ్ముతున్నారు. దీంతో సమంత దీనిపై క్లారిటీ ఇస్తే తప్పా అర్థం తెలిసేలా లేదు.
సమంత సినిమాలు
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా గతేడాది విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’లో కనిపించింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక సామ్ నటించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్రస్తుతం సమంత నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ