Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..

    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..

    April 5, 2023

    ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఎన్నో హిట్‌ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్‌ వాయిస్‌తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్‌ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. సిద్‌ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్‌-10 తెలుగు హిట్‌ సాంగ్స్‌ను ఇప్పుడు చూద్దాం. 

    1. శ్రీవల్లి:

    పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్‌ యూనిక్‌ వాయిస్‌ వల్లే ఈ పాటకు అంత హైప్‌ వచ్చింది. 

    2. కళావతి

    సర్కారు వారి పాటలో కళావతి సాంగ్‌ను శ్రీరామ్‌ చాలా బాగా ఆలపించాడు. కమాన్‌ కమాన్‌ కళావతి అంటూ మహేష్‌ చేత స్టెప్పులు వేయించాడు. ఈ పాట రిలీజ్‌ తర్వాత సిద్‌ శ్రీరామ్‌ ఫేమ్‌ మరింత పెరిగింది.

    3. మగువ మగువ

    వకీల్‌సాబ్‌ చిత్రంలోని మగువ మగువ సాంగ్‌ మహిళల గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ పాటకు తన స్వరం ద్వారా సిద్‌ శ్రీరామ్‌ జీవం పోశాడు. 

    4. ఇంకేం ఇంకేం కావాలి

    గీతా గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను శ్రీరామ్‌ ప్రాణం పెట్టి పాడాడు. ఒక్క ఇంగ్లీష్‌ పదం లేని ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్స్‌లోని డీప్‌ ఎమోషన్స్‌ను శ్రీరామ్‌ తన గొంతులో చక్కగా పలికించాడు. అప్పట్లో యూత్‌ను ఈ పాట విపరీతంగా ఆకర్షించింది. 

    5. ఉండిపోరాదే

    2018లో విడుదలైన హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే పాట’ అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయింది. ప్రేమలో విఫలమైన యువకుడి బాధను తన గొంతులో శ్రీరామ్‌ పలికించాడు. దీంతో యువకులు ఈ పాటకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు.  

    6. సామజవరగమన

    అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఘన విజయానికి అల్లు అర్జున్‌ క్లాసీ స్టెప్పులు ఎంతగానో దోహదం చేశాయి. అలాగే శ్రీరామ్‌ కూడా తన స్వరం ద్వారా సాంగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

    7. మాటే వినదుగా

    టాక్సీవాలా చిత్రంలోని ‘మాటే వినదుగా’ పాట సిద్‌ శ్రీరామ్‌ హిట్‌ ఆల్బమ్స్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట ద్వారా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో శ్రీరామ్‌ స్థానం సంపాదించాడు. 

    8. అడిగా అడిగా 

    నిన్నుకోరి సినిమాలోని ‘అడిగా అడిగా’ పాట భగ్న ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది. ప్రేయసి ప్రేమను బలంగా కోరుకునే యువకుడి ఫీలింగ్స్‌ను సిద్‌ చాలా బాగా వ్యక్తపరిచాడు. ఈ పాటకు గాను ఈ యువ గాయకుడికి మంచి ప్రశంసలే దక్కాయి. 

    9. వచ్చిందమ్మ

    గీతా గోవిందం మూవీలోని ‘వచ్చిందమ్మా’ పాట కూడా మంచి హిట్ అయింది. ఈ పాటలో శ్రీరామ్‌ వాయిస్‌ ప్రేక్షకులను మిస్మరైజింగ్‌ చేసిందనే చెప్పాలి. 

    10. ఏమున్నావే పిల్ల

    నల్లమల్ల సినిమాలోనే ఏమున్నావే పిల్ల పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆడకపోయిన ఈ పాట మాత్రం ఇప్పటికా చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌ ఉంది.

      

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version