దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అప్‌డేట్ గురించి మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే వాటిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్‌లో కనీసం ఒక్క అప్‌డేట్ అయినా ఇస్తారా? లేదా? అంటూ మదన పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం సంభాషణలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో RRR చిత్రానికి మాటలు రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా కథ రాసుకున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ వీరాభిమానులం అని చెప్పుకొచ్చారు. ఆయన నవలల ఆధారంగానే స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు వెళ్లడించారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది.
మహేష్ లుక్‌పై జాగ్రత్తలు
SSMB 29లో మహేష్ లుక్(Mahesh look) ఎలా ఉండనుందన్న ఆసక్తి ప్రస్తుతం ఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుంది.
మహేష్ సరసన అలియా భట్?
‘SSMB 29’ సినిమాలో మహేష్‌కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా ‘SSMB 29’ చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
SSMB 29.. టైటిల్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే ‘SSMB 29’ సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్ చిత్రానికి ‘మహారాజ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ పేరులో మహా.. రాజమౌళిలలో ‘రాజ’ తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!