• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన భారత్.. బంగ్లాతో సెమీస్

    ఆసియా గేమ్స్‌లో టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్లు బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, సైఫ్ హసన్(C), అఫీఫ్ హొస్సేన్, షాహదత్ హొస్సేన్, జాకర్ అలీ(w), రకీబుల్ హసన్, హసన్ మురాద్, మృత్తుంజోయ్ చౌదరి, రిపాన్ మొండోల్ భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(C), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ(w), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, … Read more

    ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

    ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈరోజు జరిగిన మిక్స్డ్ ఆర్చరీ ఈవేంట్‌లో భారత ఆటగాళ్లు జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజా గోల్డ్ మెడల్ సాధించారు. 5 కిలోమీటర్ల ట్రాక్ రేస్‌లో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి స్వర్ణం గెలిచింది. మరోవైపు 35మీ. మిక్స్డ్ వాక్ రేస్‌లో మజ్ను, రాంబాబు సిల్వర్ కొట్టారు. ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 71 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. వీటిలో 16 స్వర్ణాలు, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

    నేపాల్‌పై భారత్ ఘన విజయం

    ఆసియాకప్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసిన నేపాల్ గొప్ప పోరాటం చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ 32, సందీప్ జోరా 29 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. నేపాల్ స్కోరు 179/9, ఇండియా స్కోరు 202/4.

    భారీ స్కోరు చేసిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో పసికూన నేపాల్‌కు టీమిండియా భారీ టార్గెట్ విధించింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్ 15 బంతుల్లో 37 పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3 వికెట్లు, సోంపాల్ కామి ఒక వికెట్ పడగొట్టారు.

    గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

    ఆసియా గేమ్స్‌- గోల్ఫ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున తొలిసారి పతకం సాధించిన క్రీడాకారిణిగా అదితి నిలిచింది. మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో జోవార్ సింగ్, చెనాయ్, పృథ్వీరాజ్‌తో కూడిన టీమ్ గోల్డ్ గెలిచింది. మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రాజేశ్వరి, మనీషా, ప్రీతి బృందం సిల్వర్ మెడల్ కొట్టింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. వీటిలో 11 గోల్డ్ మెడల్స్, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. Screengrab … Read more

    పాక్‌ను చిత్తు చేసిన భారత్

    ఆసియా గేమ్స్‌- హాకీలో పాకిస్తాన్‌పై 10-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాక్‌ను చిత్తు చేశారడు. తాజా విజయంతో గ్రూప్‌ ఏలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 216 పతకాలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

    టెన్నిస్‌లో భారత్‌కు బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్ బొపన్న – రుతుజ భోసలే ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దక్కించుకుంది. మొత్తంగా భారత్‌ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం వచ్చింది. 9th Gold for … Read more