‘బలగం’ సినిమా మరో రికార్డు
కమెడియన్ వేణు ఎల్దంది డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బలగం మరో రికార్డు సృష్టించింది. థియేటర్లు, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమా టీవీలోనూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా ఇటీవల స్టార్ ‘మా’ లో ప్రసారం అయ్యింది. అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా విడుదలైంది. బలగం మూవీకి ఏకంగా 8.42 TRP రేటింగ్ వచ్చింది. దీంతో బలగం సత్తా మరోసారి నిరూపితమైంది.