[VIDEO](url): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీసిన బలగం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. భోళా శంకర్ సెట్‌లో బలగం టీమ్‌ను కలిసిన చిరు వారిని సన్మానించారు. చిత్రం చాలా చక్కగా తీశావంటూ చిత్ర డైరెక్టర్ వేణును అభినందించారు. బాగా సినిమా చేసి షాకులు ఇస్తే ఎలా? అంటూ నవ్వులు పూయించారు. ‘గతంలో జబర్దస్త్ వేదికపై వేణు స్కిట్స్ వేశాడు. వేణుకు ఇంత టాలెంట్ ఉందా? అని అతనిపై గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక తన టాలెంట్‌ను మరో నిరూపించుకున్నాడు’ అని చిరు అన్నారు.