‘బలగం’ చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బెస్ట్ డ్రామా ఫీచర్ విభాగంలో ‘ఒనికో ఫిల్మ్ అవార్డ్‘ దక్కించుకుంది. కాగా ఇంతకుముందు నంది అవార్డును దక్కించుకుంది. అలాగే బెస్ట్ పీచర్ ఫిల్మ్, బెస్ట్ పీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగంలో లాస్‌ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. కాగా ఈ అవార్డులపై చిత్ర దర్శకుడు వేణు యెల్దండి స్పందించారు. తన సినిమా బృందం వల్లే ఇదంతా సాధ్యమైందని.. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషపడ్డారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా బలగం సినిమా రూపొందింది. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, రూపా లక్ష్మీ, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన బలగం ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో తెరలు కట్టి మరీ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటే బలగంకు దక్కిన ఆదరణ ఏంటో అర్థమవుతోంది.
చిత్ర నిర్మాత దిల్‌రాజుకు బలగం గొప్ప పేరును తీసుకొచ్చింది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు రాని పేరు ప్రఖ్యాతులు దిల్‌రాజుకు బలగం ద్వారా దక్కాయి. అటు దర్శకుడు వేణును చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ పల్లెల మట్టివాసనను తెరపై అందంగా చూపించాడు. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండించాడు. వేణు తన మెుదటి చిత్రంతోనే అంతర్జాతీయ అవార్డులు గెలుచుకొని తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?