కళాతపస్వికి ప్రముఖల నివాళులు
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం పార్ధివదేహం ఉంచారు. విశ్వనాథ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.