ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తరచుగా చాలా చిన్న వయసులో హార్ట్ఎటాక్స్‌తో మరణిస్తున్న సంఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అంత మంచి జీవిన విధానం పౌష్టిక ఆహారం తింటూ, వ్యాయామాలు చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారికి కూడా గుండెపోటు రావడం ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా నేడు టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత గుండెపోటుతో సోనాలి ఫోగట్ 42 ఏళ్ల వయసులో గుండె పోటుతో చనిపోయింది. ఇటీవల చిన్న వయసులో మరణించిన సెలబ్రిటీలు ఎవరో ఒకసారి పరిశీలిస్తే….
1.సోనాలి ఫోగట్
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ 42 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్‌తో నేడు మరణించింది. ఆమె తన స్టాఫ్‌తో కలిసి ఆగస్ట్ 22న గోవా వెళ్లింది. రాత్రి పార్టీకి వెళ్లి ఆగస్ట్ 23న తిరిగి వచ్చింది. కాసేపటికే తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరింది. సోనాలి ఫోగట్ బీజేపీ హరియాణా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉంది. మరణించే కొన్ని గంటల ముందు ఆమె ఇన్‌స్టాలో సంతోషంగా ఉన్న రీల్‌ను పోస్ట్ చేసింది. కానీ అంతలోనే మృత్యువు ఆమెను కబలించింది.
2. దీపేశ్ భాన్
నటుడు దీపేశ్ భాన్ 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. బాబీజీ గర్‌పర్ హై సినిమాలో మల్కన్ అనే పాత్రతో అతడికి మంచి గుర్తింపు లభించింది. దీపేశ్ భాను జులై 22, 2022న ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడు బ్రెయిన్ హామరేజ్‌తో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ సమయంలో అతడు చాలా ఫిట్‌గా ఉండేవాడు.
3. కృష్ణ కుమార్ కున్నత్ (KK)
ప్రముఖ సింగ్ KK మరణం సంగీత ప్రియుల హృదయాల్ని కలిచివేసింది. అప్పటివరకు కోలకత్తాలోని ఒక కాన్సర్ట్‌లో పాటలు పాడుతూ ఉత్సాహంగా కనిపించిన కేకే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మరణానికి సరైన కారణాలేంటో ఇప్పటివరకు తెలియలేదు. మే 31, 2022న 54 ఏళ్ల వయసులో కేకే మరణించాడు. కేకే హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషల్లో పాటలు పాడటంతో దేశవ్యాప్తంగా అతడికి ఫ్యాన్స్ ఉన్నారు.
4.పునీత్ రాజ్‌కుమార్
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతడి అభిమానులకు, కర్ణాటక ప్రజలకే కాదు సామాన్యులను షాక్‌కు గురిచేసింది. అక్టోబర్ 21, 2021న వ్యాయామాలు చేస్తుండగా అతడికి హార్ట్ఎటాక్ వచ్చింది. పునీత్ మరణం తర్వాత అతడు నటించిన జేమ్స్ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ 2 కంటే ముందు కన్నడ ఇండస్ట్రీలో అదే అతిపెద్ద రికార్డు.
5. సిద్ధార్త్ శుక్లా
బాలికా వదూ, హిందీ బిగ్‌బాస్ 13 ఫేమ్ సిద్దార్త్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. సెప్టెంబర్ 1, 2021న సిద్ధార్త్‌కు కొంచెం అలసటగా అనిపించడంతో మెడిసిన్ తీసుకున్నాడు. నిద్రలోనే హార్ట్ఎటాక్‌తో మరణించాడు. తెల్లవారిన తర్వాత అతడి తల్లి, సోదరి వచ్చి ఎంత పిలిచినప్పటికీ లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడు. ఎప్పుడు చాలా ఫిట్‌గా కనిపించే సిద్దార్త్ అంత చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం బాలీవుడ్‌ను ఆశ్ఛర్యానికి గురిచేసింది.
6. రాజ్ కౌశల్
దర్శకుడు రాజ్ కౌశల్ 50 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. షాదీ కా లడ్డూ, ప్యార్ మే కభీ కభీ చిత్రాలతో అతడికి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు లభించింది. అయితే జూన్ 30, 2021న ఉదయం కౌశల్ హార్ట్ఎటాక్‌తో మరణించాడు. ఆ సమయంలో అతడు అక్కడ్ బక్కడ్ రఫు చక్కర్ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కౌశల్ భార్య నటి మందరి భేడి అన్న విషయం తెలిసిందే.
7.అమిత్ మిస్త్రీ
థియేటర్, టీవీ, సినిమా నటుడు అమిత్ మిస్త్రీ ఏప్రిల్ 23, 2021న ముంబయిలోని అతడి ఇంట్లో గుండెపోటుతో మరణించాడు. 47 ఏళ్ల వయసులో అతడి మరణం విషాధాన్ని మిగిల్చింది. టెలివిజన్‌లో తెనాలి రామగా ఫేమస్ అయ్యాడు. దీంతో పాటు మేడమ్ సార్ అనే యాక్షన్ సిరీస్, యమ్ల పగ్లా దివానా, షోర్ ఇన్ ది సిటీ వంటి సినిమాల్లో నటించాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!