చంద్రబాబుపై పోటీకి రెడీ: పెద్దిరెడ్డి
AP: కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో పోటీకి సిద్ధమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు డిపాజిట్ కూడా దక్కదని మంత్రి జోస్యం చెప్పారు. పుంగనూరులో తనపై పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. కుప్పం, పుంగనూరులో ఎక్కడైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని వెల్లడించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.