• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లెజండరీ దర్శకుడు విశ్వనాథ్ బయోపిక్!

  కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా ప్రస్తుతం విశ్వనాథ్ బయోపిక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకే ‘విశ్వదర్శనం’ టైటిల్‌తో కళాతపస్వి బయోపిక్ మొదలైంది. ఈ చిత్రాన్ని జనార్థన మహర్షి తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఏమైందో ఏమో ఆ బయోపిక్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం విశ్వనాథ్ మృతి నేపథ్యంలో ఆ బయోపిక్‌ను మళ్లీ మొదలు పెడతారని టాక్.

  కళాతపస్వి కన్నుమూత; తీవ్ర విచారంలో బాలకృష్ణ

  దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారంలో మునిగిపోయారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన దిగ్గజ దర్శకుడి మృతి తీవ్ర విషాదానికి గురి చేసినట్లు బాలయ్య తెలిపారు. కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో బాలయ్య ఒకే ఒక్క చిత్రంలో ‘జననీ జన్మభూమి’ నటించాడు. కానీ ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’, ‘పాండురంగడు’, ‘సీమసింహం’ చిత్రాల్లో బాలకృష్ణకు తండ్రిగా నటించాడు.

  ఆస్కార్ బరిలో ‘కళాతపస్వి’ చిత్రం

  దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) వృద్ధ్యాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అగ్ర కథానాయకులకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాలను ఇండస్ట్రీకి అందించారు. వాటిలో ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’, ‘ఆపద్భాంధవుడు’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వరాభిషేకం’, ‘నేరము-శిక్ష’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. [‘స్వాతిముత్యం’](url) సినిమా 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam Only … Read more

  సౌండ్ ఆర్టిస్ట్ టు లెజండరీ డైరెక్టర్

  కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) వృద్ధాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా పెదపులివర్రు. గుంటూరు హిందు కాలేజీలో ఇంటర్, ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం చెన్నై వెళ్లి విజయవాహినీ స్టూడియోలో సౌండి రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా మారాడు. తొలి చిత్రానికే ‘నంది’ అవార్డు అందుకున్నాడు. ఆయన 9 బాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం చేపట్టారు.

  తండ్రైన స్టార్ డైరెక్టర్; ఎమోషనల్ పోస్ట్

  తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ [వీడియో](url) పోస్ట్ పెట్టారు. ‘‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఇంతకు మించిన ఆనందం మాకు మరెక్కడా లేదు. మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. They … Read more

  గోపీచంద్‌కు రజినీకాంత్ ఫోన్; ఎందుకో తెలుసా?

  ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫోన్ కాల్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ మూవీ తనకెంతగానో నచ్చిందని గోపీని రజినీకాంత్ మెచ్చుకున్నారు. సినిమా మేకింగ్ అద్భుతంగా తీశారని ప్రశంసించారు. దీనికి స్పందనగా గోపీచంద్.. ‘‘రజినీ సర్ ప్రశంసల కంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థాంక్యూ రజినీ సర్.’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.

  ఆస్కార్ ఎంట్రీ రానందుకు బాధేసింది; జక్కన్న

  ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అధికారికి ఎంట్రీ రానందుకు చాలా బాధేసిందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘ఛెల్లో షో’ ఆస్కార్ షార్ట్ లిస్టులో స్థానం దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ ఎఫ్ఎఫ్ఐ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే,’’ అంటూ పేర్కొన్నారు.

  ఆ సినిమా అప్పులు తీర్చడానికి ఐదేళ్లు పట్టింది; కృష్ణవంశీ

  తను దర్శకత్వం వహించి నిర్మించిన ‘సింధూరం’ సినిమా అప్పులు తీర్చడానికి ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఓ నెటిజన్ ‘సింధూరం’ మూవీని రీ రిలీజ్ చేయాలని కృష్ణవంశీని అడిగాడు. దానికి సమాధానంగా ఆయన ఈ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా 1997లో సింధూరం మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. Courtesy Twitter: chinni Courtesy Twitter: … Read more

  జక్కన్నకు హాలీవుడ్ పురస్కారం

  దర్శక ధీరుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డ్స్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ [[బెస్ట్ డైరెక్టర్‌](url)గా రాజమౌళి హాలీవుడ్ పురస్కారం దక్కించుకున్నాడు. పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పోటీపడి మరీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమా నికి రాజమౌళి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌ ళి మాట్లాడుతూ.. తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొ న్నారు. India's Pride @ssrajamouli Garu Received Best Director Award at @nyfcc ❤️‍🔥❤️‍🔥. … Read more

  మీ జీవితానికి మీరే హీరో; పూరీ జగన్నాథ్

  వచ్చిన అవకాశాలను వదులుకోకూడదని, మీ జీవితాలకు మీరే హీరో అని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’లో యూత్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘యువతలో విపరీతమైన బలం ఉంటుంది. వద్దన్న పనే చేస్తారు. భవిష్యత్‌పై బెంగ ఉండదు. మీలాంటి యువతే మేథావులకు కావాలి. కానీ ధర్నాలు, ఉద్యమాలు అంటూ మిమ్మల్ని కొంతమంది పక్కదోవ పట్టిస్తారు. కానీ మీరు గుర్తించి తిరగాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.’’ అంటూ పూరీ పేర్కొన్నారు.