మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్‌గా మారాడు. జబర్దస్త్ నటుడు శాంతికుమార్ తుర్లపాటి ‘నాతో నేను’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్‌ను ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కంచారు. ఈ సినిమాలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, ఐశ్వర్య ప్రధాన పాత్రలు పోషించారు. సత్య కశ్యప్ స్వర రచన చేశారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.
బలగం సినిమాతో దర్శకుడిగా మారి హిట్ కొట్టిన వేణు బాటలోనే శాంతి కుమార్ వెళ్తున్నాడు. ఓ మంచి కథతో చిత్రం తీయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఓ మంచి కథను రాసి నిర్మాత కోసం వెతికానని…కథ నచ్చి వెంటనే ప్రశాంత్ టంగుటూరి అంగీకరించారని పేర్కొన్నాడు. “ నా తొలి ప్రయత్నానికి సాయి కుమార్ అండగా ఉన్నారు. చక్కని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను..దానిని చక్కగా తెరపైకి చూపిస్తాను. ఆ దిశగా కృషి చేస్తాను” అన్నాడు.
శాంతి కుమార్ జబర్దస్త్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. పదుల సంఖ్యలో స్కిట్స్ వేసి నవ్వులు పూయించాడు. తన నటనతో మెప్పించిన శాంతి కుమార్‌ను వివిధ టీం సభ్యులు కూడా ప్రోత్సహించారు. అయితే… ప్రస్తుతం జబర్ధస్త్ రేటింగ్ తగ్గింది. ఒకప్పుడున్న సభ్యులు బయటకు వచ్చి వేరే షోలు, సినిమాలు చేసుకుంటున్నారు.
జబర్ధస్త్‌లో పనిచేసిన వాళ్లు దర్శకులుగా మారటానికి ఆ షో ఎంతో సహాయపడింది. అందులో ఎవరికి వారే స్కిట్‌ను రాసుకోవటం కారణంగా అప్పటికే వారిలో ఉన్న రచనా నైపుణ్యం మరింత బయటపడింది. చిన్నపాటి కథలు రాసే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఏకంగా మెగా ఫోన్ పట్టుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. బలగం సినిమాతో వేణు హిట్ కొట్టి ఫేమస్ కావటంతో మిగతావారికి స్ఫూర్తి కలుగుతోంది. ఈ క్రమంలో ఇంకా ఎంతమంది దర్శకులుగా మారుతారో చూడాలి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!