• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందుకే ముద్దు సీన్స్‌లో నటించను: ప్రియమణి

  తాను వివాహం చేసుకున్నాక సినిమాల్లో ముద్దు సీన్లలో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు హీరోయిన్ ప్రియమణి తెలిపింది. ‘‘ముద్దు సీన్లలో నటిస్తే నా భర్తకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి సీన్స్‌లో నటించలేదు. సినిమా అగ్రిమెంట్ ముందే దర్శక, నిర్మాతలకు ఈ విషయం చెబుతాను. నా సినిమాలు మా ఇంట్లో వాళ్లు చూస్తారు. ఇలాంటి సీన్స్ ఉంటే వారు ఇబ్బందిపడతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  DRUGS CASE: కేపీ చౌదరికి సురేఖావాణి ముద్దు!

  తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి డ్రగ్స్ కేసు కదిపేస్తోంది. నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు అతడు 12 మంది పేర్లు బయటపెట్టాడు. ఈ క్రమంలో సినీ నటి సురేఖావాణితో పాటు తన కూతురు సుప్రీతతో కేపీ చౌదరి సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ పార్టీలో కేపీ చౌదరికి సురేఖా ముద్దు పెడుతున్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతనితో వీరికున్న రిలేషన్ ఏంటనేది తెలియరాలేదు.

  షారుఖ్‌కు యువతి బలవంతపు ముద్దు!

  బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఓ యువతి బలవంతంగా ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అ మహిళా అభిమాని షారుక్ వద్దకు చేరుకుని.. మిమ్మిల్ని ముద్దు పెట్టుకోవచ్చా.. అంటూ అడిగింది. సమాధానం చెప్పేలోగానే షారుఖ్ బుగ్గపై ఆమె ముద్దు పెట్టేసింది. ఊహించని పరిణామంతో ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. Love for this man will never diminish because, this man has always … Read more

  స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్

  సీనియర్ నటుడు నరేష్-పవిత్రలు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.. ఈ క్రమంలో ఆ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ షోలో వారిద్దరూ పాల్గొన్నారు. అక్కడ స్టేజీపైనే ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

  నేనెప్పుడు ముద్దు పెట్టుకోవాలో: తెలుగు యాంకర్

  [వీడియో:](url) టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. బాలీవుడ్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ తమ మొదటి వివాహ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో రణ్‌బీర్‌కు ఆలియా ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘ఓరి దేవుడా.. ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకు ఎప్పుడొస్తుంది.’’ అంటూ పేర్కొంది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. Ranbir Kapoor and Alia … Read more

  అన్నా చెల్లెలి అనురాగం; రాహుల్, ప్రియాంకల వీడియో వైరల్

  కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఒకే వేదిక పంచుకున్నారు. ప్రియాంకను దగ్గరకు లాక్కొని రాహుల్ [ముద్దు](url) పెట్టాడు. ఈ సన్నివేశం వారిద్దరి అనురాగానికి అద్దం పట్టేలా ఉంది. కాగా తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయత పంచడంతో ప్రియాంక కొంత ఇబ్బంది పడింది. ప్రియాంక కాసేపు నవ్వాపుకోలేక పోయింది. కాగా జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, … Read more

  చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో

  ఓ చిన్నారి ‘బాలయ్య’ అని పిలవగానే నందమూరి నటసింహం చలించిపోయాడు. ఆ పాపను దగ్గరికి పిలిపించుకుని మరీ ముద్దాడాడు. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ గ్యాప్‌లో బాలకృష్ణ బయట కూర్చుని ఉన్నారు. అక్కడే ఉన్న పవన్ అభిమానుల మధ్య నుంచి[ ‘బాలయ్య’ ](url)అనే పిలుపు వినిపించింది. గమనించిన బాలయ్య ఆ పాపను దగ్గరికి తీసుకురావాలని సూచించాడు. చిన్నారి తండ్రి ఆమెను ఎత్తుకుని బాలయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. బాలయ్య చిన్నారిని ముద్దాడి వివరాలు అడిగా తెలుసుకున్నారు. "బాలయ్య" అని పాప పిలవగానే daggarki pilipinchukoni… ??❣️ Wholesome … Read more

  రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నాగుపాము

  ఓ యువకుడు ఇళ్ల మధ్యలోకి వచ్చిన నాగుపామును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆ పాము కూాడా అతని పెదాలపై కాటు వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో భయపడ్డ అతడు పామును వదిలేశాడు. ప్రస్తుతానికి ఆ యువకుడికి ప్రాణాపాయం లేదని తెలిసింది. ఈ ఘటన కర్నాటకలోని షిమోగా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ లిప్ లాక్‌పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘అతనికి అలా జరగాల్సిందే’, ‘ఆ పాముకు ఆల్‌రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’ అంటూ జోకులు వేస్తున్నారు. #Watch | In a horrifying video … Read more