కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఒకే వేదిక పంచుకున్నారు. ప్రియాంకను దగ్గరకు లాక్కొని రాహుల్ [ముద్దు](url) పెట్టాడు. ఈ సన్నివేశం వారిద్దరి అనురాగానికి అద్దం పట్టేలా ఉంది. కాగా తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయత పంచడంతో ప్రియాంక కొంత ఇబ్బంది పడింది. ప్రియాంక కాసేపు నవ్వాపుకోలేక పోయింది. కాగా జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది.