కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాహుల్
అదానీ వ్యవహారంలో కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తొలినాళ్లలో అదానీ విమానంలో మోదీ ప్రయాణించేవారని.. ఇప్పుడు ప్రధాని విమానంలో అదానీ వెళ్తున్నారని ఆరోపించారు. ప్రధాని విదేశీ పర్యటనలు అదానీకి లాభం చేకూర్చాయని రాహుల్ విమర్శించారు. ‘ఇజ్రాయెల్, బంగ్లాదేశ్‌లకు ప్రధాని వెళితే అదానీకి కాంట్రాక్టులు లభించడం, ఆస్ట్రేలియాకు వెళ్తే 1 బిలియన్ రుణం లభించడం, శ్రీలంక విండ్ పవర్ ప్రాజెక్టు అదానీకి ఇప్పించాలని బలవంతం చేయడం.. ఇది భారత విదేశీ విధానంలా లేదు. అదానీ విధానంలా ఉంది’ అంటూ రాహుల్ విమర్శించారు.