• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణకు రాహుల్.. 3 రోజులు ఇక్కడే!

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల రెండో వారంలో తెలంగాణ రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే తుక్కుగూడ సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

    రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్

    రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కేరళ- వయనాడ్ కాకుండా.. హైదరాబాద్ వచ్చి తన మీద పోటీ చేయాలని సవాలు విసిరారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయాలని ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యాలని సూచించారు. https://x.com/TeluguScribe/status/1706223721248354682?s=20

    రాహుల్ గాంధీని పెళ్లాడుతా: హీరోయిన్

    ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా తెలిపింది. ఇటీవల షెర్లిన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రాహుల్‌కు నచ్చితే వివాహమాడుతా. కానీ ఆయనను వివాహం చేసుకోవడానికి ఓ కండీషన్ ఉంది. పెళ్లి తర్వాత నేను ఇంటి పేరు మార్చుకోను.’’ అంటూ పేర్కొంది. షెర్లిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా షెర్లిన్ ప్రస్తుతం పౌరాష్‌పూర్-2 అనే వెబ్‌సీరీస్‌లో నటించింది. ఈ సీరీస్ గత నెల 28న విడుదలైంది.

    రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా..?

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అన్నారు. దీంతో ‌అక్కడే ఉన్న రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. मां, प्रियंका और मेरे … Read more

    రైతులే దేశానికి బలం: రాహుల్

    రైతుల సమస్యలను అర్థం చేసుకుంటే దేశంలో సగం సమస్యలను పరిష్కరించినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి బలమని గుర్తు చేశారు. ఇటీవల హర్యానాలోని సోనీపత్ జిల్లాలో రైతులను కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసుకుంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రైతులు ఎంతో నిజాయితీపరులని, సున్నిత మనస్తత్వం కలిగిన వారని రాహుల్ చెప్పారు. धान की रोपाई, मंजी पर रोटी – किसान हैं भारत की ताकत ??? … Read more

    భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ

    బిహార్ ఆర్జేడీ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య లేని వారు ప్రధాని నివాసంలో ఉండటం తప్పని చెప్పారు. ప్రధాని అయ్యే వ్యక్తులకు తప్పనిసరిగా శ్రీమతి ఉండాలని లాలూ వ్యాఖ్యానించారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీకి లాలూ సూచించడం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ధాంగి లేకుండా పీఎం నివాసంలో ఉండే సంప్రదాయాన్ని వచ్చే ఎన్నికల్లో 300 సీట్లతో కడిగేస్తామని ఆయన చెప్పారు. … Read more

    రాహుల్ సభలో ఖలీస్థానీల హల్‌చల్

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభలో ఖలీస్థానీ మద్ధతుదారులు హల్‌చల్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఖలీస్థానీ మద్ధతుదారులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాహుల్ స్పందిస్తూ ‘‘విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rahul Gandhi heckled for the 1984 Sikh genocide (unleashed by the Congress), in America… ऐसी नफ़रत … Read more

    మోదీజీ దేవుడికే పాఠాలు చెబుతారు: రాహుల్

    ప్రధాని మోదీ భారత ప్రజలను భయపెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతా తమకే తెలుసనుకునే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చరిత్రకారులకే చరిత్ర చెప్పేలా, సైన్యానికే యుద్ధం నేర్పేలా చేస్తారు. చివరికి దేవుడికి కూడా పాఠాలు చెప్పేలా తయారయ్యారు. అలాంటి వారిలో ఒకరు మోదీ’ అంటూ కాలిఫోర్నియాలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ విరుచుకు పడ్డారు. Just listen the speech of Mr #RahulGandhi "Santa … Read more

    ‘రాహుల్ గాంధీ నిజమైన బాహుబలి’

    కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని బాహుబలి సినిమాలోని పాటతో పోలుస్తూ వీడియో పోస్ట్ చేశారు. దండాలయ్య సాంగ్‌ను రాహుల్ గాంధీ ప్రచారానికి అనుగుణంగా ఎడిట్ చేశారు. రాహుల్‌ గాంధీ నిజమైన బాహుబలి అంటూ కీర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. Real life Bahubali ? BJP do you know we just won karnataka with out spreading hate, that’s congress … Read more

    ఛత్తీస్‌గడ్‌లో కూలిన కాంగ్రెస్ స్టేజీ

    [VIDEO](url): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టేజిపై నేతలంతా నిలబడి ప్రసంగాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి స్టేజి కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా నేతలంతా కింద పడిపోయారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మర్కం కూడా ఇందులో ఉండటం గమనార్హం. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి … Read more